చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా.
స్వశక్తితో కష్టపడి ఎదిగిన నటుడు.అద్భుత సినిమాల్లో నటించి మెగాస్టార్ గా తెలుగు సినీ అభిమానుల మనుసుల్లో నిలిచిపోయాడు.
చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగానే సినిమా అవకాశాన్ని అందుకున్నాడు.పునాదిరాళ్లు అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ సినిమాతోనే తన కెరీర్ కు బలమైన పునాదిరాళ్లు వేసుకున్నాడు.ప్రస్తుతం తను 153వ సినిమాగా గాడ్ ఫాదర్ చేస్తున్నాడు.
సినిమా హీరో కావాలనే గట్టి సంకల్పమే ఆయనను మద్రాసుకు వెళ్లేలా చేసింది.
సినిమా హీరో అయ్యేంత వరకు తిరిగి ఇంటికి రాకూడదు అని చిరంజీవి భావించాడు.
సినిమా అవకాశాల కోసం ఎంత మంది మద్రాసు వీధుల్లో తిరుగుతున్నారో ఆయనకు తెలుసు.చదివింది బీకాం.అందుకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు.నటనలో శిక్షణ తీసుకున్నాడు.
నటనలో మంచి ప్రతిభ కనబర్చాడు.అదే సమయంలో పునాదిరాళ్లు సినిమాలో అవకాశం వచ్చింది.
నిజానికి తనకు సినిమా అవకాశాలు కావాలని ఆయన ఏ నిర్మాత, దర్శకుడి చుట్టూ తిరగకపోవడం విశేషం.
అయితే శిక్షణా కాలంలో ఏ విద్యార్థి కూడా సినిమాల్లో నటించకూడదు అనే నిబంధన ఉంటుంది.అందుకే చిరంజీవి తొలుత ఒప్పుకోలేదు.కానీ దర్శకుడు భారతీరాజా ఇనిస్టిట్యూట్ అనుమతి తీసుకున్నాడు.
దీంతో ఆయన పునాదిరాళ్లు సినిమాలో నటించాడు.ఈ సినిమా స్టిల్స్ చూసి ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ ప్రాణ ఖరీదు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.
అప్పుడే శివశంకర వరప్రసాద్.పేరు చిరంజీవిగా మారిపోయింది.
అటు తనకు సినిమా పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో కొన్న పాత్రలను తనకు ఇష్టం లేకపోయినా.భవిష్యత్ కోసం నటించాడు చిరంజీవి.తను హీరోగా కొనసాగుతున్న రోజుల్లో విలన్ పాత్రలు పోషించే అవకాశం వచ్చింది.ఆ పాత్రలు చేయను అంటే పెద్ద నిర్మాణ సంస్థలు ఏమనుకుంటాయో? మళ్లీ అవకాశాలు ఇస్తాయో? లేదో? అనే భయంతో నో చెప్పలేకపోయాడు.హీరో క్యారెక్టర్ అని చెప్పి.రెండు సినిమాల్లో క్రిష్ణతో కలిసి విలన్ పాత్రలు పోషించేలా చేశారు.
అయినా తన కెరీర్ కోసం తప్పక చేశాడు.