ఆ ముగ్గురు లాంటి బ‌ల‌మైన నేత‌ల‌ను అందిస్తామంటున్న రేవంత్‌..

ప్ర‌స్తుతం కాంగ్రెస్ జోరు మీద ఉంది.అస‌లు ఊపే లేని పార్టీలో ఇప్పుడు అంతో ఇంతో ఈ జోష్ క‌నిపిస్తోందంటే కార‌ణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి.

 Revanth Wants To Provide Strong Leaders Like Those Three., Revanth, Politics, Ys-TeluguStop.com

ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత పార్టీని న‌డిపించేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఉనికి లేని పార్టీని మ‌ళ్లీ అన్ని వ‌ర్గాలకు ద‌గ్గ‌ర చేసే క్ర‌మంలో ద‌ళిత‌, గిరిజ‌న దండోరా లాంటి కార్య‌క్ర‌మం తీసుకుని ఆ వ‌ర్గాల‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు బాగానే ఫ‌లిస్తున్నాయి.

ఇక రేవంత్ దూకుడు చూసి ఇత‌ర పార్టీల్లోని నేత‌లు కూడా కొంత టెన్ష‌న్ ప‌డుతున్నారు.ఇలాగే రేవంత్ వెళ్తే త‌మ‌కు ముప్పే అని అంతా భావిస్తున్నారు.

ఈ దండోరా స‌భ‌ల్లో రేవంత్ స్పీచ్ పీక్స్ లో ఉంద‌నే చెప్పాలి.ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగం నిజంగా జ‌నాల‌ను ఆక‌ట్టుకునేలాగే ఉంటోంది.అయితే నిన్న జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంతో మంది బ‌ల‌మైన నాయకులను అందించింద‌ని తెలిపారు.

ఇక చంద్రబాబు, కేసీఆర్, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి వారంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే న‌ని, అలాంటి వారెంద‌రినో కాంగ్రెస్ పార్టీ త‌యారు చేసింద‌ని చెప్పుకొచ్చారు.ఇక ఇప్పుడు కూడా అలాంటి వారిని అందించాల‌న్నారు.

Telugu Chandrababu, Revanth, Revanthdalitha, Revanth Speech, Ysraja-Telugu Polit

మ‌రీ ముఖ్యంగా వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ వంటి బ‌ల‌మైన నేతలను యూత్ కాంగ్రెస్ ఇప్పుడు అందించాల‌ని, అది సాధ్య‌మే అవుతుంద‌ని తనదైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.ఇప్పుడు రేవంత్ చెప్తున్న‌ట్టు ఒక‌ప్పుడు కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి వారంతా కూడా మొద‌ట కాంగ్రెస్ నుంచి త‌మ రాజకీయ జీవితం ప్రారంభించి స‌క్సెస్ అయ్యారు.ఇక వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి అయితే త‌న చివ‌రి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే.చంద్రబాబు, కేసీఆర్ లాంటి నేత‌లు మాత్రం ఇత‌ర పార్టీల్లో హ‌వా కొన‌సాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube