ఆ ముగ్గురు లాంటి బలమైన నేతలను అందిస్తామంటున్న రేవంత్..
TeluguStop.com
ప్రస్తుతం కాంగ్రెస్ జోరు మీద ఉంది.అసలు ఊపే లేని పార్టీలో ఇప్పుడు అంతో ఇంతో ఈ జోష్ కనిపిస్తోందంటే కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి.
ఆయన వచ్చిన తర్వాత పార్టీని నడిపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికి లేని పార్టీని మళ్లీ అన్ని వర్గాలకు దగ్గర చేసే క్రమంలో దళిత, గిరిజన దండోరా లాంటి కార్యక్రమం తీసుకుని ఆ వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు బాగానే ఫలిస్తున్నాయి.
ఇక రేవంత్ దూకుడు చూసి ఇతర పార్టీల్లోని నేతలు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు.
ఇలాగే రేవంత్ వెళ్తే తమకు ముప్పే అని అంతా భావిస్తున్నారు.ఈ దండోరా సభల్లో రేవంత్ స్పీచ్ పీక్స్ లో ఉందనే చెప్పాలి.
ఆయన చేస్తున్న ప్రసంగం నిజంగా జనాలను ఆకట్టుకునేలాగే ఉంటోంది.అయితే నిన్న జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది బలమైన నాయకులను అందించిందని తెలిపారు.
ఇక చంద్రబాబు, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి లాంటి వారంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే నని, అలాంటి వారెందరినో కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు కూడా అలాంటి వారిని అందించాలన్నారు. """/"/
మరీ ముఖ్యంగా వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ వంటి బలమైన నేతలను యూత్ కాంగ్రెస్ ఇప్పుడు అందించాలని, అది సాధ్యమే అవుతుందని తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు రేవంత్ చెప్తున్నట్టు ఒకప్పుడు కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారంతా కూడా మొదట కాంగ్రెస్ నుంచి తమ రాజకీయ జీవితం ప్రారంభించి సక్సెస్ అయ్యారు.
ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే తన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే.
చంద్రబాబు, కేసీఆర్ లాంటి నేతలు మాత్రం ఇతర పార్టీల్లో హవా కొనసాగిస్తున్నారు.
వీడియో: ఫ్యాషన్ పిచ్చితో లిప్‌స్టిక్ టాటూ వేయించుకుంది.. ఇప్పుడామె పెదవులు చూడలేరు బాబోయ్!