ఏ పార్టీలో అయినా సరే అధినాయకుడి ఆశీర్వాదం, ఆయన అండదండల కోసం ప్రతి ఒక్కరూ పాకులాడుతారు.ఎందుకంటే రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే తపన కావచ్చు లేదంటే ఇంకేదైనా గుర్తింపు కోసం అయినా లేదంటే పదువుల ఆశకోసం ఇలా ఏదో ఒకరకంగా పార్టీలో తమ పలుకుబడి పెంచుకునేందుకు అధినాయకుడికి భజన చేయడం అనేది చాలా కామన్.
అయితే అది ఈ మధ్య ఏపీలోని వైసీపీలో మరీ ఎక్కువగా అయిపోయింది.ఎంతలా అంటే ఏకంగా జగన్‌ను దేవుడు అంటూ అసెంబ్లీలోనే చెప్తున్నారంటే ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా ఇప్పుడు మంత్రుల మార్పు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భజన కాస్త హద్దులు దాటి పోతోంది.ఈ మధ్య శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపుమదుసూధన రెడ్డి అందరికంటే ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా జగన్ కు పెద్ద గుడే కట్టడం రాజకీయాల్లో పెద్ద సంచలనమే రేపింది.ఇక ఆయన కట్టిన గుడి అయితే దాదాపు రు.3 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ స్థాయిలో జగన్ నమ్ముకున్న నవరత్నాలు గుర్తుకు తెప్పించేలా ఆ గుడిని ఆయన కట్టేశారు.ఇప్పుడు వైసీపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారడం చూస్తూనే ఉన్నాం.
![Telugu Aim, Ap, Jagan, Temple Jagan, Ycp, Ycp Jagan-Telugu Political News Telugu Aim, Ap, Jagan, Temple Jagan, Ycp, Ycp Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/08/YCP-leaders-doing-such-work-New-implications-for-Jagana.jpg )
అభిమానం అనేది ఇలా హద్దులు దాటితేనే ఇబ్బంది కలిగిస్తోంది.జనాల్లో కూడా చులకన అయిపోతామనేది అందరికీ తెలిసిన విషయమే.ఇక ఈ ఎమ్మెల్యే కూడా మంత్రిపదవిని ఆశించే గుడికట్టారనేది లోలోపల నడుస్తున్న చర్చ.
అభిమానం అనేది ప్రజల్లో ఇమేజ్‌ను పెంచేలాగా ఉండాలని నవ్వుకునేలాగా ఉండొద్దని జగన్ ఇప్పటికే చెప్పినా కూడా ఇలాంటి నేతలు ఆయనకు కొత్త ఇబ్బందులు తీసుకు వస్తున్నారు.ఎందుకంటే జనాలకు ఏదో ఒక మంచి పని జగన్ పేరు మీద చేస్తే అప్పుడు జనాల్లో కూడా ఇద్దరికీ లాభం జరుగుతుంది కానీ ఇలాంటివి చేస్తే జగన్‌కు విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.