ఇటీవలే బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ను ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే శిల్పా శెట్టి తన భర్త నిమిత్తమాత్రుడని కొంతమంది కావాలనే తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించారని పలు ఆరోపణలు చేసింది.
దీంతో సోషల్ మీడియా మాధ్యమాలను శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి కొందరు కావాలని నెగిటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు.
దీనికితోడు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ అశ్లీల చిత్రాల వ్యవహారంలో రాజ్ కుంద్రా ని అరెస్టు చేయడం సబబేనని స్టేట్మెంట్లు ఇచ్చారు.
దీంతో రోజు రోజుకి శిల్పా శెట్టి కుటుంబం మరియు ఆమె భర్త పై కొంతమంది నెగెటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు.దీంతో తాజాగా శిల్పాశెట్టి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయం గురించి స్పందించింది.
ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా చాలా సమస్యలతో తను సతమతమవుతున్నానని అలాగే తమ అనుకున్నవాళ్ళు మరియు శ్రేయోభిలాషులు కూడా అవాంఛనీయ విమర్శలు చేశారని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం తాను పోరాడక తప్పదని కాబట్టి దయచేసి తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారాలు చేయొద్దని అలాగే భారతీయ న్యాయ వ్యవస్థ పై తమకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపింది.
అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర వ్యక్తుల గురించి తప్పుడు కథనాలు ప్రచురించడం మరియు అబద్ధపు వ్యాఖ్యలని ప్రచారం చేయడం మానుకోవాలని కోరింది.అంతేకాక అనవసరంగా ఈ విషయంలోకి తన కుటుంబ సభ్యులను మరియు పిల్లలను లాగద్దని వేడుకుంది.
దీంతో కొందరు శిల్పాశెట్టి అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ధైర్యం చెబుతున్నారు.కాగా తాజాగా ఈ విషయంపై పై టాలీవుడ్ ప్రముఖ నటుడు “మాధవన్” కూడా స్పందించాడు.
ఇందులో భాగంగా మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉందని అంతేకాకుండా ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలరని తెలిపాడు.అంతేకాకుండా మీరు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆ దేవుడిని ప్రార్థిస్తానని తన మద్దతును తెలియజేశాడు.