ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రేపు ఖరారైన విషయం తెలిసిందే.కాగా పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్ విషయంలో కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెల్లుతున్నారట.
ఈ నేపధ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు చేశారు.ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెల్లుతున్నది ప్రజల కోసం కాదని, తన సొంతపనులను చక్కదిద్దు కోవడానికి అంటూ ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా జగన్ గారు మీ ఢిల్లీ యాత్ర స్వామి కార్యమా లేక స్వకార్యమా అంటూ ప్రశ్నించారు.మరోవైపు జగన్ వ్యాక్సిన్ల విషయంలో ఇతర రాష్ట్రాల సీఎంలను కూడగట్టే ప్రయత్నంలో భాగంగా లేఖలు రాసిన విషయం తెలిసిందే.
అయినా జగన్ ఏపీ ప్రజల కోసం ఏ మంచి పని చేసినా దాన్ని వక్రీకరించడం, అక్కరకు రాని ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు బాగా అలవాటు అయిన విషయమే కదా అని రామయ్య విమర్శలు విన్న జనం అనుకుంటున్నారట.