అక్కినేని ప్రిన్స్ అఖిల్ నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.
విడుదల కు సిద్దం అయిన సమయంలో కరోనా వల్ల నిలిచి పోయింది.అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంది.
ఈ సినిమా అఖిల్ కెరీర్ కు చాలా కీలకం.అందుకే నిర్మాత అల్లు అరవింద్ తో పాటు నాగార్జున కూడా ఈ సినిమా పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.
అందుకే ఇప్పటికే మూడు నాలుగు సార్లు రీ షూట్ చేశారనే టాక్ వినిపిస్తుంది.దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం.
అందుకే ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాడు.షూటింగ్ అంతా పూర్తి అయ్యిందని భావిస్తున్న సమయంలో మళ్లీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు.
మూడు నాలుగు రీ షూట్ ల తర్వాత అల్లు అరవింద్ మరోసారి రషెష్ చూశాడట.ఎట్టకేలకు ఆయనకు నచ్చిందట.ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే దసరా సీజన్ లో విడుదల చేయాలని భావించారు.కాని కరోనా వల్ల మొత్తం ప్లాన్స్ తలకిందులు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను బొమ్మరిల్లు తో పోల్చుతూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆరెంజ్ లా మారిపోదు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్.అందుకే ఈమె అభిమానులు కూడా ఆ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు.
మరి తుది ఫలితం ఏంటో చూడాలి.