తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా ఉదృతితో ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కోవిడ్ వైరస్ నివారణకు ఊపయోగించే రెమ్ డెసివిర్ ఇంజక్షన్ కోసం పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.
అసలే ఈ ఇంజక్షన్ నో స్టాక్ అనే బోర్డు దర్శనం ఇస్తుండగా, కొందరు దళారులు బ్లాక్‌లో అమ్ముకుంటూ కాసులకు కక్కూర్తి పడుతున్నారు.
ఈ నేపధ్యంలో హెటిరో అనుబంధ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది.
రెమ్ డెసివిర్ ఇంజక్షన్ కోసం వాట్సాప్ చేస్తే చాలు.ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి అనే వివరాలు మీ ఫోన్ కే పంపిస్తామని పేర్కొంటున్నది.
ఈ విషయాన్ని హైదరాబాద్ మూసాపేట వైజంక్షన్‌లోని హెటిరో అనుబంధ సంస్థ ప్రకటించింది.
ఇకపోతే ఈ టీకా కావాల్సిన వారు 9133896969 నెంబరుకు వాట్సప్ లేదా ఎస్‌ఎంఎస్ చేస్తే చాలని, రోగి లేదా అటెండర్ పేరు, ఫోన్ నెంబర్, చికిత్స పొందుతున్న ఆసుపత్రి పేరు, పేషంట్ కు కేటాయించిన ఐపీ నెంబర్, చికిత్స పొందుతున్న నగరం, ఎన్ని టీకాలు కావాల్సిన సంఖ్య వంటి వివరాలు పంపాలని సూచించారు.అంతే కాకుండా రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ఉన్న స్టాక్ ను బట్టి ఎక్కడ, ఎప్పుడు తీసుకోవాలి అనేది రోగి బంధువులకు సమాచారం ఇస్తామని తెలుపుతున్నారు.