కీర్తి సురేష్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ట్రెడిషనల్ గా మాత్రమే కనిపించేది.కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్ తో రోజు రోజుకు అభిమానులను ఆకట్టుకుంటుంది.
కీర్తి టాలెంట్ తో పాటు అందం గా కూడా ఉంటుంది.కానీ ఇప్పుడు ఆ అందాన్ని రోజురోజుకు బయటకు తీస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది.
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది కీర్తి.
అయితే ఈ అమ్మడు ట్రెండీ లుక్ బయటకు వచ్చింది.
ఈ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతోష పెడుతుంది.మొదట్లో బొద్దుగుమ్మగా ఉండే కీర్తి ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది.
ఇప్పుడిప్పుడే గ్లామర్ పాత్రలలో కనిపించడానికి రెడీ అవుతుంది.తాజాగా కీర్తి సురేష్ స్టయిల్ గా చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
![Telugu Premier, Keerthy Suresh, Keerthysuresh, Mahesh Babu, Sarkaruvaari-Movie Telugu Premier, Keerthy Suresh, Keerthysuresh, Mahesh Babu, Sarkaruvaari-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/04/heroine-keerthy-suresh-trendy-look-photo-viral-99-songs-moviej.jpg )
కీర్తి సురేష్ 99 సాంగ్స్ అనే సినిమా ప్రీమియర్ వేడుకలో పాల్గొనడానికి ఇలా స్టైల్ గ ట్రెండీగా రెడీ అయింది.ఈ ఫోటో చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.రోజురోజుకు స్టైల్ గా తయారవుతూ తాను కూడా గ్లామర్ పాత్రలు చేయగలనని హింట్ ఇస్తుంది.
ఈ మధ్యే నితిన్ తో రంగ్ దే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో కామెడీతో ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంది.
ప్రస్తుతం కీర్తి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.