అప్పుడప్పుడు మనం సముద్రంలో కొన్ని వింత జీవులను, వింత చేపలను చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
అలాంటి జీవులు, చేపలు సోషల్ మీడియాలో తెగ వైరలై కనిపిస్తుంటాయి.ప్రజలు కూడా ఈ జీవులను చూడటానికి ఎంతో మక్కువ చూపిస్తారు.
అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది.పశ్చిమ బంగ్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఫిష్ సీడ్లో ఈ చేప కనిపించింది.
నలుపు, తెలుపు చారలను కలిగి ఉన్న ఈ చేప సముద్రంలో ఫిషింగ్ వెళ్లే గంగపుత్రుల చేతికి చిక్కింది.
ఈ చేపను సక్కర్ ఫిష్ అంటారని ఏపీ మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
గతంలో పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాలువల్లో ఈ చేపలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.ఈ చేపలు ఎక్కువగా పశ్చిమ బంగ్లాకు దగ్గర్లో ఎక్కువగా ఉంటాయని, కోల్‌కతా నుంచి వచ్చే ఆక్వాసీడ్లో కలిసిపోయి ఆంధ్రాకు వచ్చినట్లు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ చేపల వల్ల ఆక్వా రైతులకు ఎంతో నష్టం వస్తుందని, చేపల చెరువులో ఈ చేపలు చేరితే భారీ నష్టం వాటిళ్లుతుందన్నారు.
ఇవి సుమారు 50 అంగుళాల పొడవు పెరుగుతాయని, ఇవి ఎక్కువగా సముద్రం, కాలువల్లో కూడా అరుదుగా కనిపిస్తాయన్నారు.
![Telugu Fish, Suckker Fish, Suckkerfish, Latest-Latest News - Telugu Telugu Fish, Suckker Fish, Suckkerfish, Latest-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/04/Suckker-Fish-in-East-Godavari-Suckker-Fish-fish-viral-latest-viral-news.jpg )
ఈ చేపలు చాలా డిఫరెంట్ఇవి తోటి చేపలను, సముద్రంలోని మిగిలిన జీవులను కూడా తినేస్తుంది.ఇంకా చెప్పాలంటే మనుషుల మాంసాన్ని కూడా తినేస్తుంది.ఇది ఒక రకమైన క్యాట్‌ఫిష్ జాతికి చెందినది.
పిరానా వంటి చేపలను పోలీ ఉంటుంది.అయితే ఈ చేపలను మనుషులు తినలేరు.
దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.అందుకే ఆక్వా రైతులు ఈ చేపలు కనిపిస్తే చాలు వెంటనే చంపేస్తారు.
అలాగే ఈ చేపల వల్ల పర్యావరణానికి హాని ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.