ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం వకీల్ సాబ్.పవన్ కళ్యాణ్ మూడున్నరేళ్ల తరువాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.
ఇప్పటికే ట్రైలర్ విడుదలతోనే ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టింది.ఇక ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్ లుగా నటించారు.శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల.
ఈ ముగ్గురు హీరోయిన్ లు తెలుగు ప్రేక్షకులకు రకరకాల చిత్రాల ద్వారా పరిచయం ఉంది.కాని ఇందులో కొత్త నటి తెలుగు భామ అనన్య నాగల్ల.
అసలు వకీల్ సాబ్ ముందు వరకు ఈ భామ ఎవరో తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.
అయితే ఒక్కసారిగా ఈ అమ్మాయి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా చోటు దక్కించుకునే సరికి ఒక్కసారిగా సినీ పరిశ్రమ దృష్టి అనన్య పడింది.
వకీల్ సాబ్ కంటే ముందు అనన్య మల్లేశం సినిమాలో నటించింది.అయితే ఆ సినిమాలో నటనను చూసి దర్శకుడు వేణు శ్రీరామ్ మూడు సార్లు అడిషన్స్ చేసిన తరువాత అనన్యను కన్ఫర్మ్ చేసాడట దర్శకుడు వేణు శ్రీరాం.
అయితే ఇప్పుడు వకీల్ సాబ్ తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంది.