నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.నీళ్ళు,నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం.
ఏ ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగం చేసి మరీ తెలంగాణ సాధింకుకున్నామో తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి ఉంది.ఇక మనకు ఉద్యోగం రాదేమోనన్న బాధతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించడం లేదు.ఈ మధ్య సునీల్ నాయక్ అనే నిరుద్యోగి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు త్రాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి ఉంది.
అయితే సునీల్ నాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇదే ఉద్యోగం ముందు ఇచ్చి ఉంటే సునీల్ నాయక్ చనిపోయి ఉండేవాడు కదా.ఇలా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం తగదని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి.అయితే కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత నిరుద్యోగుల ఆత్మహత్యలపై స్పందించాడు.నిరుద్యోగులంతా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు.ఇప్పటికైనా నిరుద్యోగుల వ్యధను పట్టించుకొని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తుందని ఆశిద్దాం.మరి ఇప్పటికైతే నోటిఫికేషన్ లకు సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.