దేశంలో కరోనా మొదటి సారిగా వ్యాపించినఫ్ఫుడు ప్రజల్లో కనిపించిన భయం ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ లో కనిపించడం లేదు.అంటే ఏదైతే జరుగుతుందో దానికి భయపడటం ఎందుకు చస్తే చస్తామని మొండిగా బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తుంది వీరి ప్రవర్తన.
ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కరోనా కూడా విసృతంగా వ్యాపించడం మొదలు పెట్టింది.
ఇకపోతే గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక రోజులో 98 వేల కొత్త కరోనా కేసులు వచ్చిన తరువాత, తిరిగి ఐదు మాసాల తరువాత ఆ స్థాయిలో కొత్త కేసులు నిన్న వచ్చాయట.
కాగా నిన్న శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయని, ఇదే సమయంలో నాలుగు నెలల తరువాత మరణాల సంఖ్య 500ను తాకిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది.
అంతే కాకుండా ఈ ఉదృతి మరో వారం, పది రోజుల పాటు సాగితే తక్కువ వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటవేసే అవకాశాలు ఉన్నాయని కాబట్టి అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి, కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది.
ఇదిలా ఉండగా ఇండియాలో శుక్రవారం నాడు 89 వేల కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ప్రపంచ దేశాల్లో శుక్రవారం మిగతా అన్ని దేశాల కన్నా, ఇండియాలో కేసుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.
యూఎస్ లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదవడం ఆశ్చర్యం.