విజయనగరం జిల్లా రామతీర్థం లో విగ్రహాల ధ్వంసం అయినా సమయంలో వైసిపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో విజయసాయి రెడ్డి గారు టీడీపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు చుట్టుముట్టడం జరిగింది.
అంతే కాకుండా విజయసాయి రెడ్డి కారుపై దాడి కూడా చేయడం జరిగింది.జరిగిన దాడిలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
దీంతో విజయసాయిరెడ్డి అదే రోజు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.విజయసాయిరెడ్డి ఫిర్యాదుమేరకు ఇప్పటివరకు టీడీపీ పార్టీకి చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు.
గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు ని ఏ1 గా చేర్చటం జరిగింది.
![Telugu Achhanniyudu, Ap Poltics, Chandrababu, Rama Thirdam-Political Telugu Achhanniyudu, Ap Poltics, Chandrababu, Rama Thirdam-Political]( https://telugustop.com/wp-content/uploads/2021/01/ysrcp-demulation-of-gords-CHNDRABABU-NAIDU-kala-venkat-rao.jpg)
అంతేకాకుండా ఏ2 గా అచ్చెన్నాయుడు, ఏ3 గా కళావెంకట్రావు పేర్లు చేర్చారు.రామతీర్థం రాముని విగ్రహం ధ్వంసమైన కొండ ప్రాంతానికి విజయసాయిరెడ్డి వెళ్లి అక్కడ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన అప్పట్లో జరగటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.