సూపర్‌ ఫ్యాన్స్‌ రికార్డు బద్దలు కొట్టే విషయంలో పట్టుదలగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌

స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య ట్విట్టర్‌ రికార్డుల వార్‌ జరుగుతోంది.ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా మొదలైన ఈ ట్విట్టర్‌ వార్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

 Pawan Kalyan Fans, Mahesh Babu Fans, Twitter Record, Birthday Hash Tag-TeluguStop.com

ఈ వార్‌తో ప్రపంచ రికార్డ్‌లను నమోదు చేస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎన్టీఆర్‌ రికార్డును బ్రేక్‌ చేస్తే మహేష్‌బాబు ఫ్యాన్స్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ రికార్డును బద్దలు కొట్టారు.

ఇలా ఒకరి తర్వాత ఒకరు రికార్డులు బద్దలు కొడుతూనే వెళ్తున్నారు.మహేష్‌బాబు పుట్టిన రోజున ఆరు కోట్ల ట్వీట్స్‌ తో ప్రపంచ రికార్డును నెలకొల్పిన మహేష్‌బాబు ఫ్యాన్స్‌ రికార్డును పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్‌బాబు ఫ్యాన్స్‌ రికార్డును సవాల్‌ చేయకుండానే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ చాపకింద నీరులా ఆ రికార్డును బీట్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.బర్త్‌డే కామన్‌ డీపీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది.

ఆ డీపీకి సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రపంచ రికార్డును నమోదు చేయాలని భావిస్తున్నారు.ఒక వేళ ఈసారి కాకుంటే పవన్‌ బర్త్‌డే రోజున అయినా మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.

Telugu August, Hash Tag, Maheshbabu, Pawankalyan-

ట్విట్టర్‌లో హ్యాష్‌ ట్యాగ్స్‌ పై ట్వీట్స్‌ చేయడం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం.కాని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేలా ట్వీట్స్‌ చేయడం మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.మహేష్‌బాబు బర్త్‌డే రోజు హ్యాపీ బర్త్‌డే మహేష్‌బాబు హ్యాష్‌ ట్యాగ్‌ ను 24 గంటల్లో 6 కోట్లకు పైగా ట్వీట్స్‌ చేసి రికార్డు సృష్టించారు.ఇప్పుడు అదే రికార్డును పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేయాలనుకుంటున్నారు.వారు 24 గంటల్లో 7.5 కోట్ల ట్వీట్స్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు.ముందు ముందు పది కోట్ల టార్గెట్‌ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube