వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయంలోనూ తనదైన స్పీడుతో వరుసబెట్టి సినిమాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని ఏటీటీలో రిలీజ్ చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలను ఆయన తన ఏటీటీలో రిలీజ్ చేశాడు.
కాగా ప్రస్తుతం పవర్‌స్టార్ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు.ఇక ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు వర్మ రెడీ అయ్యాడు.
కాగా ప్రస్తుతం వర్మ బాటలో మరో దర్శకుడు పయనించాలని చూస్తున్నాడు.దర్శకుడు తేజ కూడా తన చిత్రాలను ఏటీటీలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు.ఓటీటీలో అయితే నెలకో, సంవత్సరానికో ఓసారి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది.కానీ ఏటీటీలో పే ఫర్ వ్యూ పద్ధతి ఉండటంతో ఇందులో ఏ సినిమా చూడాలన్నా టికెట్ కొనాల్సిందే.
ఇప్పుడు ఇదే పద్ధతిని రామ్ గోపాల్ వర్మ ఫాలో అవుతుండటంతో తేజ కూడా సొంతంగా ఓ ఆన్‌లైన్ థియేటర్ ఓపెన్ చేసి దాంట్లో సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.
నిజానికి ఈ విధంగా సినిమాకు ఇంత రేటు అని ఫిక్స్ చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా అంతమొత్తం చెల్లించి చూస్తారు.
ఈ పద్ధతితో ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బడ్జెట్ చిత్రాన్ని రిలీజ్ చేసినా నిర్మాతలు భారీ లాభాలను పొందగలరని గతంలో సురేష్ బాబు లాంటి నిర్మాత అనడంతో ఇప్పుడు పలువురు ఈ బాటలోనే పయనించాలని చూస్తున్నారు.మరి నిజంగానే తేజ ఏటీటీలో తన సినిమాలు రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి.