దేశంలో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా వైరస్ ప్రజలను గజగజా వణికిస్తోంది.దేశంలో రాజకీయ, సినీ, క్రీడా, బుల్లితెర ప్రముఖులు కరోనా భారీన పడ్డారు.
తాజాగా విప్లవ రచయితల సంఘం(విరసం) నాయకుడు వరవరరావుకు కరోనా నిర్ధారణ అయింది.గత కొన్ని రోజుల నుంచి ఆయన కరోనా సంబంధిత లక్షణాలతో బాధ పడుతున్నారు.
నేడు ఆయనకు వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది.
నేవీ ముంబైలోని జేజే ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స కొనసాగుతోంది.
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర సర్కార్ కు, పోలీసులకు వరవరరావు కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.సోమవారం రాత్రి వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను జేజే ఆస్పత్రిలో చేర్పించగా వైరస్ నిర్ధారణ కావడంతో తాజాగా సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావును ఎన్.ఐ.ఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.వరవరరావుకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళనకు గురవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆయనను తప్పుడు కేసుల్లో ఇరికించిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు ముంబైకు వెళ్లి వరవరరావును కలిశారని సమాచారం.
ప్రస్తుతం వరవరరావు ఆరోగ్యం నిలకడగానే ఉంది ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలతో వరవరరావు ఏడాదిన్నరగా జైలులో ఉన్నారు.2018 ఆగష్టు నెలలో వరవరరావును అరెస్ట్ చేశారు.