యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తీసుకున్న తారక్, ఇప్పుడు ఈ మూవీ తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ తన నెక్ట్స్ మూవీని కన్ఫం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ షూటింగ్, డబ్బింగ్ పనులు ముగించేలోపే త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్‌ను తారక్ ప్రారంభించనున్నాడు.
ఈ షూటింగ్‌ను మే నుండి ప్రారంభించేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ వచ్చేస్తుంది.
అంటే అప్పటి వరకు తారక్ గ్యాప్ లేకుండా బిజీగా ఉండనున్నాడు.
కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న తారక్, ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఇంత బిజీగా మారుతున్న తారక్ తన నెక్ట్స్ మూవీలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.