యంగ్ హీరో నిఖిల్ కెరీర్లో తొలి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కార్తికేయ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన కార్తికేయ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది.
ఈ సినిమా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.
కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేశారు.
దీనికి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమా కథ ఏమిటో ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.ద్వాపర యుగంలోని ఒక రహస్యాన్ని కలియుగంలో కనుగొనేందుకు కార్తికేయ జరిపే అన్వేషణనే ఈ సినిమా కథ అని టీజర్లో తెలిపారు.
టీజర్ చివరిలో చైత్రంలో చిత్రీకరణ అని చిత్ర యూనిట్ తెలపడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను చందూ ముండేటి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.ఈ సినిమాలోని నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.