సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తూ వయసు మీద పడిన తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తున్నాడు.తన ప్రతి సినిమాలో ఎనర్జీ లెవల్స్ చూపిస్తూ నేటితరం హీరోలకి మారదర్శకంగా నిలుస్తున్నారు.
అయితే రజినీకాంత్ ఇమేజ్, అతని ఎనర్జీ లెవల్స్ కి సరిపోయే కంటెంట్ ని దర్శకులు అందించలేకపొతున్నారు.ఈ కారణంగానే మురుగదాస్ లాంటి దర్శకుడు కూడా రజినీకాంత్ తో ఫ్లాప్ సినిమానే తీసారు.
రజినీకాంత్ కోసం భారీగా బడ్జెట్ అయితే పెడుతున్నారు.కాని అతని ఇమేజ్ ని మాత్రం కథతో అందుకోలేక తంటాలు పడుతున్నారు.ఇదిలా ఉంటే స్టార్ హీరో అజిత్ కి వరుస విజయాలు అందించిన యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంతో ప్రస్తుతం రజినీకాంత్ కొత్త సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో రామోజీలో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ని దర్శకుడు తాజాగా ఫిక్స్ చేశాడు.ఈ సినిమాకు అన్నాతే అనే టైటిల్ ఖరారు చేశారు.
ఇక టైటిల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ వీడియో ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది.మరి ఈ సినిమాతో దర్శకుడు శివ అయిన రజినీకాంత్ ఫాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగాలడా లేక ఎప్పటిలానే నిర్మాతతో పాటు బయ్యర్లకి నష్టాలు మిలుగుస్తాడా అనేది చూడాలి.