ఆ కోటా పై కోర్టుకు : పిటిషన్ వేసిన ఓ సంస్థ

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మోదీ సర్కార్ వేసిన ఎత్తుగడ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.దేశంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి.

 Petition In Supreme Court On 10 Percent Quota-TeluguStop.com

ఉభయ సభల ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది.అయితే ఈ బిల్లును సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్విటీ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ బిల్లు వల్ల దేశంలో రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.ఉద్యోగాల్లోఅగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

ఈ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు, రాజ్‌పుట్స్, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, క్షత్రియ వంటి ఉన్నత సామాజిక వర్గాల ప్రజలు లబ్ధిపొందనున్నారు.ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5శాతం రిజర్వేషన్లకు ఇది అదనం.దీంతో దేశంలో రిజర్వేషన్లు 59.5శాతం అవుతాయి.అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

ప్రస్తుత బిల్లు ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఉండటంతో దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube