వేసవికాలంలో ఎక్కువగా వచ్చే పనసపండు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.ఇతర పండ్ల కన్నా భిన్నమైన రుచిలో ఉంటుంది.
ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.పనసపండు తినటం వలన తక్షణ శక్తి లభిస్తుంది.
పనసపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.పనసపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
అంతేకాక పనసలో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
పనసపండులో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు,కొలెస్ట్రాల్,మధుమేహం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.
వయస్సు రీత్యా వచ్చే ముడతలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఈ పండును తినటం వలన ముడతలు తొందరగా రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది.
పనసపండ్లు తియ్యగా ఉన్నా సరే మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.ఈ పండులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరగవు.
అందువల్ల మధుమేహం ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు.పనసపండులో విటమిన్ ఎ, సి లు ఉండుట వలన రోగ నిరోధక శక్తి పెరిగి వైరల్ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.