జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తోన్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.తాను ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ చెప్పారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది.వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం కూడా లేదు.
గట్టిగా చెప్పాలంటే 20 నెలలు మాత్రమే ఉంది.కానీ జనసేన ఇంకా తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించలేదు.
పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు.ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నీశన్ డైరెక్షన్‌లో ఏఎం.రత్నం నిర్మించే సినిమాలో నటిస్తాడు.
ఈ రెండు సినిమాలకే యేడాదికి పైగా టైం పడుతుంది.
మరి పవన్ ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభిస్తాడు ? పార్టీని ఎలా బలోపేతం చేస్తాడన్నది ? ఎవ్వరికి అంతుపట్టడం లేదు.ఇదిలా ఉంటే పవన్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చేసిన ప్రకటన రాజకీయంగా ఆ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
పవన్ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడు ? అన్నది క్లారిటీ లేకపోయినా మూడు నాలుగు నియోజకవర్గాల పేర్లు వినిపించాయి.అనంతపురం అర్బన్, గుంతకల్, కదిరి పేర్లు తెరమీదకు వచ్చాయి.
మరి ప్రస్తుతం ఉన్న పొజిషన్‌లో పవన్ ఆ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా గెలుపు మాత్రం కష్టమే అన్న చర్చలు జిల్లాలో వినిపిస్తున్నాయి.ప్రస్తుతం జనసేనకు జిల్లాలో అస్సలు ఊపులేదు.
కనీసం పేరున్న నాయకులు ఎవ్వరూ లేరు.
పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో సినిమాలు చేసుకుంటూ, అప్పుడప్పుడు సభలు, గొర్తొచ్చినప్పుడు ట్వీట్లు పెడుతూ టైం గడిపేస్తోన్న పవన్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
ఇంకా చెప్పాలంటే పవన్ అన్న చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్నికలకు ముందు మాత్రం మంచి ఊపు ఉంది.ప్రస్తుతం జనసేనకు ఆ ఊపు కూడా లేదు.
ఇక అంత ఊపు ఉన్నా చిరు తన సొంత జిల్లాలోని పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు అనంతపురంలో పోటీ చేస్తానని చెపుతోన్న పవన్‌కు సైతం ఇదే పరిస్థితి ఉంటే అన్నకు పట్టిన గతే పడుతుందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
జనసేన జెండా, ఎజెండాల గురించి ఏపీ, తెలంగాణలో ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు.పవన్ ఇప్పటకీ షూటింగ్‌ల పేరుతో హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు.
ఇంకా జనాల్లోకి రావడం లేదు.మరి ఈ లెక్కన పవన్ పార్టీ కాదు కదా.? కనీసం పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితులు లేవన్నది అనంత జిల్లా టాక్.