చిత్తూరు జిల్లా కుప్పంలో హై టెన్షన్ కొనసాగుతోంది.పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుడిపల్లి స్టేషన్ కు వస్తారని పోలీసులు అప్రమత్తమైయ్యారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు గుడిపల్లి నుంచి తరలించారు.మరో వాహనానికి తాడుకట్టి ప్రచార రథాన్ని లాక్కెళ్లారు.
స్టేషన్ లో సౌండ్ వాహనానికి అడ్డంగా మరికొన్ని వాహనాలను ఉంచారు.దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.