లోకంలో మనుషులు ఒక వస్తువు విషయంలో తీసుకునే జాగ్రత్త తమ ప్రాణాల విషయంలో తీసుకోవడం లేదు.అసలు జీవితం అంటే లెక్కలేనట్లుగా బ్రతుకుతున్నారు.
పదివేలు పెట్టి కొనుకున్న సెల్ పట్ల ఉన్న శ్రద్ధ, మళ్ళీ మనిషిగా పుడతామో లేదో తెలియని బ్రతుకు పట్ల ఉండటం లేదు.అదేగనుక ఉంటే లోకంలో క్షణ క్షణం ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి కాదు.
ఇకపొతే సరదాగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న స్నేహితుల ప్రాణాలను అదే సరదా తీసింది.ఎలాగో తెలుసుకుంటే.తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి శెట్టిపేటకు చెందిన ముగ్గురు యువకులు కనిపించకుండా పోయారు.ఈ క్రమంలో వీరి కుటుంబికులు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నేపధ్యంలో ముమ్మిడివరం మండలం గేదెల్లంక గోదావరిలో యువకుడు మృతదేహం లభించిందని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.కాగా ఆ మృతదేహం అదృశ్యమైన యువకులలో ఒకరిదని వారితో పాటుగా పోలీసులు గుర్తించారు.
ఇక మిగతా ఇద్దరి కోసం గోదావరిలో గాలించగా వారి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయట.
ఇకపోతే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు విగత జీవులుగా మారడంతో వీరి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
అయితే ఈ ముగ్గురు యువకులు పుష్కరఘాట్ లో స్థానానికి వచ్చి ప్రమాదవ శాత్తు గోదావరిలో మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.