బాబు నోట ఈ రాంగ్ డైలాగులేంటి... టీడీపీలోనే గుస‌గుసలు‌...!

ఒక‌ప్పుడంటే.పార్టీ అధినేత‌పై గౌర‌వం ఉన్న నాయ‌కులు చాలా మంది ఉండేవారు.ఇప్పుడు కూడా ఉన్నారు.ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీల్లోనూ అధిష్టానం, అధినేత‌ల‌పై గౌర‌వం ఉంది.అయితే, మారిన రాజ‌కీయాల నేప‌థ్యంలో నాయ‌కులు గ‌తంలో మాదిరిగా అధినేత ఏం చేసినా.మౌనంగా చూస్తూ కూర్చోవ‌డం లేదు.

 Wrong Dialogue In Chandra Babu Tongue,tdp Leaders Gosspis, Tdp, Chandra Babu Nai-TeluguStop.com

మౌనంగా ఉండ‌డ‌మూ లేదు.త‌మ అభిప్రాయాల‌ను బాహాటంగానో.

లేదా సోష‌ల్ మీడియా రూపంలోనో.లేక త‌మ‌కు న‌చ్చిన అనుచ‌రుల రూపంలో బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారు.

ఈ త‌ర‌హా వ్య‌వ‌హారం అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు కామ‌న్ అయిపోయింది.

తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే టీడీపీలోనూ చోటు చేసుకుంది.తాజాగా టీడీపీ నుంచి నాయ‌కులు వైసీపీ బాట‌ప‌డుతున్నారు.ముఖ్యంగా గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన నాయ‌కులు కూడా ఇప్పుడు బాబుకు గుడ్‌బై చెబుతున్నారు.ఈ క్ర‌మంలో ఎంత ఓర్చుకున్నా.బాబులో ఆక్రోశం ఆగ‌డం లేదు.

దీంతో స‌ద‌రు నేత‌ల‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.నిజానికి ఏ పార్టీలో అయినా.

నాయ‌కులు వెళ్లిపోతే.ఆ మాత్రం బాధ స‌హ‌జం.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు.ఇలా వెళ్లిపోయిన‌, వెళ్లిపోతున్న నేత‌ల‌ను “అమ్ముడు పోతున్నారు.సంత‌ల్లో ప‌శువుల మాదిరిగా“ అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అధినేత‌గా ఆయ‌న‌కు ఆ మాత్రం స్వేచ్ఛ ‌కూడా ఉంది.అయితే, ఈ వ్యాఖ్య‌ల‌ను పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు మాత్రం వేలెత్తి చూపిస్తున్నారు.

నేత‌ల జంపింగుల‌పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల విష‌యంలో వీరు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో మ‌నం కూడా ఇలానే చేశాం.

వైసీపీ నుంచి వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ప్ప‌డు కండువా క‌ప్పేశాం.అప్ప‌ట్లో మ‌నల్ని వైసీపీ ఈ మాట‌లే అంటే.

ఎదురుదాడి చేసి మ‌రీ వ్యాఖ్య‌లు కుమ్మ‌రించాం.ఇప్పుడు ఇలా వ్యాఖ్యానిస్తే.

బాగుంటుందా ? అనేది వారి ప్ర‌శ్న‌.ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, కాబ‌ట్టి ఛాయిస్ వారికే వ‌దిలేసి.

నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేస్తే బెట‌ర్ అని సూచిస్తున్నారు.మ‌రి బాబు వింటారా ?  మార‌తారా ?  చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube