ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి తమ చేజేతులారా పచ్చని కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.తాజాగా ఓ వివాహిత కట్టుకున్న భర్త తండ్రితోనే వివాహేతర సంబంధం పెట్టుకొని తన పది నెలల బిడ్డ తో సహా మామతో కలిసి పరారైన ఘటన హర్యానా రాష్ట్రంలోని చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పానిపట్ పరిసర పరిసర ప్రాంతంలో రాణి (పేరు మార్చాం) అనే వివాహిత తన భర్త , అత్త మామలతో కలిసి నివాసం ఉంటుంది.అయితే ఆమె భర్త చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.
దీంతో వివాహిత మామఎలాంటి పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటుండేవాడు.ఈ క్రమంలో అతడు తన కన్న కొడుకు భార్యని కూడా చూడకుండా రాణి తో వివాహేతర సంబంధానికి ప్రోత్సహించాడు.
దీంతో భర్త పనుల నిమిత్తమై బయటకు వెళ్ళిన సమయంలో ఈ ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు.అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చినటు వంటి కుటుంబ సభ్యులు పలు మార్లు వీరిద్దరిని మందలించారు.
దీంతో తమ వివాహేతర సంబంధానికి తమ కుటుంబ సభ్యులు అడ్డు వస్తున్నారని ఈ ఇద్దరూ ఏకంగా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యారు.అయితే అప్పటికే రాణి కి పది నెలలు నిండినటువంటి ఓ చంటి బిడ్డ కూడా ఉంది.
దీంతో విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్య ను ఎలాగైనా వెతికి పెట్టాలంటూ పోలీసులను సంప్రదించాడు.