తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు బాగా లవ్ అలాగే ఫ్యామిలీ సినిమాలను చేసినటువంటి హీరోలలో శ్రీకాంత్ ఒక్కరు.ఆయన చిరంజీతో కలిసి నటించిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాక.తనకు పాత్ర నచ్చితే.హీరో పక్కన సైడ్ క్యారెక్టర్లు చేయడానికి కూడా ఇష్టపడతారు.కాగా.
శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాని ఆయన కంటే ముందు రిజెక్ట్ చేసిన హీరో ఎవరో ఒక్కసారి చూద్దామా.
తాజ్ మహల్ సినీమాని ప్రముఖ దర్శకుడు డైరెక్టర్ ముప్పలనేని శివ నిర్మించారు.
ఆయన 1994 వ సంవత్సరంలో ఘరానా అల్లుడు చిత్రాన్ని తెరకెక్కించారు.ఆ సినిమా తరువాత మంచి ప్రేమకథతో సినిమా తీయాలని, ఆ సినిమా ఒక పెద్ద బ్యానర్ లో తీయాలంటే ఆలోచిస్తూ ఉండగా.
వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీదత్ కు ఈ కథ వినిపించారు.
అయితే ఈ కథ విన్న ఆ బ్యానర్ సంస్థ స్థాపకుడు.” నేను ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా చేస్తున్నాను.ఈ కథ కేవలం కొత్తగా వస్తున్న హీరోలకు మాత్రమే పనికొస్తుందని” చెప్పారంట.

ఇక ఒకవేళ నీకు నచ్చితే ఒక మంచి బ్యానర్లో చేయమని చెప్పారంట ఆయన.కాగా.అలా ముప్పలనేని శివ వెతుక్కుంటూ సురేష్ ప్రొడక్షన్ వైపు వెళ్ళాడు.అయితే ఈ విషయంపై హీరో వెంకటేష్ కి ఫోన్ లో కథ చెప్పగా, ఈ కథ కొత్త హీరోలకు సరిపోతుందని చెప్పారంట.

దాంతో అందరూ అలా అనడంతో ముప్పలనేని శివ.ఆలోచించి ప్రేమఖైదీ చిత్రంతో హీరోగా వచ్చిన హరీష్ అయితే బాగుంటుందని రామానాయుడు తెలియజేయడంతో.ముప్పలనేని శివ కూడా ముందుగా ఆయన మాట కోసం హరీష్ దగ్గరికి వెళ్లారు.అయితే అంతకుముందు హీరో హరీష్ ఒక సినిమా తీయడంతో అది సరిగా విజయాన్ని రాబట్టలేకపోయింది.
ఇక అందువల్లే ఆయన శ్రీకాంత్ తో ఈ సినిమా తీయవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు.కాగా.అప్పట్లో సినీ ఇండస్ట్రీకి హీరో శ్రీకాంత్ కొత్తగా పరిచయం అవుతుండడం తోనే ఈయన ఆ సినిమాని చిత్రీకరించారు.