అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన అమెరికా సర్జన్ జనరల్ పదవిని రెండు సార్లు చేపట్టి అత్యంత ఉన్నత స్థాయిలో కువైట్ ప్రవాస భారతీయ వైద్యుడు వివేక్ మూర్తి గురించి తెలియని వారు అమెరికాలో ఉండరంటే అతిశయోక్తి కాదు.ఒబామా తన హాయంలో ఏరి కోరి మరీ వివేక్ మూర్తిని జరనర్ సర్జన్ గా నియమించుకున్నారు.
ఆ తరువాత ట్రంప్ తన హాయంలో వివేక్ మూర్తిని తప్పించి స్థానిక అమెరికన్ కు ఆ పదవిని కట్టబెట్టారు.మళ్ళీ బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే పదవిని అప్పగించారు.
దాంతో వివేక్ మూర్తి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.అంతేకాదు కరోనా నివారణ, వ్యాక్సినేషన్ వంటి కీలక అంశాలపై ఎప్పటికపుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు వివేక్.
అయితే వివేక్ మూర్తి తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు.
అమెరికా ప్రజలు ఇకపై మాస్క్ అధరించాల్సిన అవసరం ఉండదని, తప్పకుండా అమెరికన్స్ అందరూ మాస్క్ నుంచీ విముక్తి పొందుతారని ప్రకటించారు.
కానీ అందుకుగాను ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు అనేది మాత్రం తాను స్పష్టంగా చెప్పలేనని తెలిపారు.ఒక నెల, ఆరు నెలలు, లేదంటే ఒక ఏడాది అయినా పట్టచ్చునని అన్నారు.
అంతేకాదు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు స్వేచ్చగా తిరగాలని అనుకోవడంలో తప్పులేదని అది వారి హక్కు అని కానీ మహమ్మారి ని దృష్టిలో పెట్టుకుంటే వారు మాత్రమే కాకుండా పక్కన ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
కరోనా పోతోందని అనుకోవడం బ్రమని పాత వేరియంట్లు కొత్త వేరియంట్లు మళ్ళీ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని కానీ మనం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు.త్వరలో మాస్క్ లేని అమెరికాను మనం చూస్తామని అసోసియేట్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.
ఇదిలాఉంటే రెండు రోజుల క్రితం ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కూడా ఇదే తరహాలో ప్రజలని అప్రమత్తం చేశారు.అయితే నాలుగో సారి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అందుకు అందరూ సిద్దంగా ఉండాలని ఫౌచీ చెప్పడంతో భవిష్యత్తులో మరో విపత్తు రాబోతోందా అనే ఆందోళన అమెరికన్స్ లో నెలకొంది.