అమెరికా వెళ్ళే వారికి బిగ్ షాకిచ్చిన విమానయాన సంస్థలు...!!!

ఎన్నాళ్ళ నుంచో అమెరికా ప్రయాణం కోసం చూసిన ఎదురు చూపులు ఈ నాడు సాఫల్యం అయ్యి అమెరికా చేక్కేయడానికి ఏం చక్కా సిద్దమయ్యిపోయిన భారత ఎన్నారైలకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాయి విమానయాన సంస్థలు.విదేశాలకు వెళ్ళాలనుకునే వారి విషయంలో డిమాండ్ ను బట్టి ధరలు పెంచడం సహజమే కానీ అమెరికా ప్రయాణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారి విషయంలో మాత్రం విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచి దాడి చేస్తున్నాయి.

 Us Flight Charges Increased, Us Flight Charges, America Flights, Indians, Nri, C-TeluguStop.com

దాంతో ఎన్నారైలు అమెరికా వెళ్తున్నామనే సంతోషం కంటే కూడా చార్జీల భారీ పెరుగుదలతో తలలు పట్టుకుంటున్నారు.వివరాలలోకి వెళ్తే.

కరోనా కారణంగా అన్ని దేశాలు విదేశీయుల రాకపై నిభందనలు విధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కరోనా వచ్చిన నాటి నుంచీ అమెరికా తమ దేశంలోకి విదేశీయులు రాకుండా ఆంక్షలు విధించింది.

అయితే తాజాగా ఈ ఆంక్షలు ఎత్తేసి నవంబర్ 8 నుంచీ వలస వాసులు తమ దేశంలోకి వచ్చేందుకు అవకాసం కల్పించింది.అలాగే అమెరికా కంటే ముందుగానే పలు దేశాలు భారతీయులపై ఆంక్షలు ఎత్తేశాయి దాంతో పలు దేశాలకు వెళ్ళే వారు ఇప్పటికే వెళ్ళడం కూడా జరిగింది.

అయితే ప్రస్తుతం

నవంబర్ 8 నుంచీ అమెరికా వెళ్ళే వారు తమ ప్రయాణాలు చేస్తుండటంతో రోజు రోజుకు అమెరికా వెళ్ళే వారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోందట.ఈ డిమాండ్ ను క్యాష్ గా చేసుకోవడానికి విమానయాన సంస్థలు ఒక్కసారిగా చార్జీలు పెంచేశాయి.గతంలో సింగిల్ టిక్కెట్ జర్నీ రూ.87 వేలు మొదలు కొని, రూ.1.2 లక్షలు వరకూ ఉండేదట కానీ ప్రస్తుతం ఇదే టిక్కెట్టు ధరను 1.5 లక్షలకు పెంచేశారు.ఇక అమెరికాలో అత్యంత డిమాండ్ ఉన్న రాష్ట్రాలైన న్యూయార్క్, వాషింగ్టన్ వంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట ప్రస్తుతం అక్కడికి వెళ్ళే వారికి సింగల్ జర్నీ టిక్కెట్టు ధర రూ.3 లక్షలు ఉండగా, బిజినెస్ క్లాస్ ధర గతంలో 3.5 లక్షలు ఉండేదట, కానీ అదే టిక్కెట్టు ధర నేడు రూ.6 లక్షలు పైమాటేనట.అయితే ఎన్నారైలకు రాక రాక అమెరికా ప్రయాణానికి అనుమతులు రావడంతో టిక్కెట్టు ధరలు ఎంతైనా సరే లెక్కచేయడంలేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube