Subhalagnam : శుభలగ్నం సినిమాలో భర్తని భార్య అమ్ముకునే పాయింట్ ఏ రైటర్ సూచించాడో తెలుసా…?

శుభలగ్నం( Subhalagnam ) 1994లో విడుదలైన తెలుగు సినిమా.దీనికి SV కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించారు.

 Unknown Facts Behind Subhalganam Movie Climax-TeluguStop.com

ఇందులో జగపతి బాబు, ఆమని భార్యాభర్తలుగా నటించారు.ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

డబ్బు, ఆనందం అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.మధ్యతరగతి జీవితం పట్ల అసంతృప్తి చెంది, మరింత సంపదను కోరుకునే అత్యాశగల భార్య పాత్రలో ఆమని నటించింది.

జగపతి బాబు( Jagapath Babu ) ప్రేమగల భర్తగా ఆమె కోరికలు తీర్చడానికి ప్రయత్నించి ఆమెను సంతోషపెట్టడంలో విఫలమవుతాడు.ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక జగపతిబాబు చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు.

ధనవంతురాలు, ఉదారంగా ఉండే రోజాను పెళ్లి చేసుకున్నట్లు నటిస్తూ ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు.

Telugu Aamani, Diwakar Babu, Jagapathi Babu, Roja, Shubha Lagnam, Subhalganam-Te

సినిమా సెకండాఫ్‌లో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది, దీనిని రచయిత, నటుడు దివాకర్ బాబు( Diwakar Babu ) చాలా ఆలోచించి రాశారు.ఆమని తన భర్తను రోజా( Roja )కి ఇచ్చి పెళ్లి చేస్తే భారీ సంపద వస్తుందని భావించే అలానే చేస్తుంది.అయితే, రోజా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఉండటం చూసి ఆమె తన తప్పును తెలుసుకుంటుంది.

ఆమె అతనిని తిరిగి గెలవడానికి ప్రయత్నిస్తుంది, ఆ సమయంలో ఎన్నో ట్విస్టులను దివాకర్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి రాసుకున్నారు.మొదట ఈ ట్విస్టులు లేక వారు సినిమా ఫ్లాప్ అవుతుందని ఎంతో ఆందోళన పడ్డారు.

అందుకే బాగా ఆలోచించి ఆమని క్యారెక్టర్( Aamani ) కి డబ్బు ఆశ ఉండేలా రాసుకున్నారు.అంతేకాదు డబ్బుపై ఆశతో భార్య చివరికి భర్తని కూడా అమ్ముకుంటుందనే పాయింట్‌ను రైటర్ దివాకర్ యే కృష్ణారెడ్డి9 SV Krishna Reddy )కి చెప్పాడు.

ఆ పాయింట్ బాగా నచ్చడంతో దానిని కృష్ణారెడ్డి హైలెట్ చేశాడు.

Telugu Aamani, Diwakar Babu, Jagapathi Babu, Roja, Shubha Lagnam, Subhalganam-Te

జగపతి బాబు తన భార్యగా ఎవరిని ఎంచుకుంటాడనే ఉత్కంఠతో ప్రేక్షకులను క్లైమాక్స్‌( Climax ) బాగా ఆకట్టుకుంటుంది.జీవితంలో డబ్బే ప్రాధాన్యం కాదు, మనం ప్రేమించే వారితో కలిసి ఉండడం వల్లే అసలైన ఆనందం కలుగుతుందనే నైతిక సందేశాన్ని ఈ చిత్రం తెలియజేస్తుంది ఈ చిత్రంలో ఆమని, జగపతి బాబు, రోజా వారి వారి పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు.ఆమని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా పొందింది.

బెస్ట్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణారెడ్డి ఒక ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube