కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో మాధవన్( Madhavan ) ఒకరనే సంగతి తెలిసిందే.మాధవన్ నటుడిగానే కాకుండా రచయితగా, సినీ నిర్మాతగా కూడా గుర్తింపును సొంతం చేసుకున్నారు.
మాధవన్ నటనకు రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించడంతో పాటు ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం కూడా లభించింది.కెరీర్ తొలినాళ్లలో మాధవన్ టీవీ సీరియల్స్ లో నటించారు.
మణిరత్నం( Maniratnam ) డైరెక్షన్ లో తెరకెక్కిన అలై పాయుదే సినిమా మాధవన్ కెరీర్ ను మలుపు తిప్పింది.మిన్నలే, డుం డుం సినిమాలు మాధవన్ కు రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చిపెట్టాయి.కన్నత్తిళ్ ముత్తమిట్టాల్, రన్ సినిమాలు హీరోగా మాధవన్ రేంజ్ ను పెంచాయి.1970 సంవత్సరంలో బీహార్ లోని తమిళ్ కుటుంబంలో మాధవన్ జన్మించారు.గజిని సినిమాలో( Gajini Movie ) నటించే ఛన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల మాధవన్ ఆ సినిమాను వదులుకున్నారు.

మాధవన్ తండ్రి టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయడం గమనార్హం.అయితే మాధవన్ స్టార్ హీరో కావడానికి ఒక ఆటోగ్రాఫ్( Autograph ) కారణమని చాలామందికి తెలియదు.మాధవన్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో మాధవన్ స్నేహితుడి ఇంటికి ప్రముఖ క్రికెటర్( Cricketer ) వచ్చారు.
మాధవన్ ఆ క్రికెటర్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్లగా ఆ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగిన వాళ్ల ఫేస్ కూడా చూడకపోవడం అవమానంగా అనిపించింది.

భవిష్యత్తులో తనను ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగితే ఫేస్ చూసి నవ్వాలని మాధవన్ అనుకున్నారట.ఆ తర్వాత రోజుల్లో మాధవన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి సత్తా చాటి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు.ప్రస్తుతం మాధవన్ కథ నచ్చితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
మాధవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.