కరోనాపై పోరు.. ఫ్లాస్మాతో సత్ఫలితాలు: అమెరికాలో కోలుకున్న ముగ్గురు ఇండో అమెరికన్లు

కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందు కోసం మానవాళి అంతా ఎదురుచూస్తోంది.చీకట్లో చిరు దీపంలా హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో దీని వాడకం ద్వారా దుష్పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 3 Indian-americans, Transfused With Plasma, Coronavirus Survivors,america-TeluguStop.com

ఇప్పుడున్న ప్రయోగాలు ఫలించి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.ఈలోగా వైరస్ సోకిన వారిని రక్షించడానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వైద్య ప్రపంచం అన్వేషిస్తోంది.
ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి వచ్చిందే ఫ్లాస్మా థెరపీ.దీని వల్ల సత్ఫలితాలు వస్తుండటంతో ప్రపంచం ఆ దిశగా ప్రయోగాలు ముమ్మరం చేసింది.తాజాగా కరోనాతో బాధపడుతున్న ముగ్గురు భారత అమెరికన్లు ఫ్లాస్మా థెరపీతో కోలుకున్నట్లుగా హ్యూస్టన్‌లోని సెంట్ లూక్స్ మెడికల్ సెంటర్ ఆదివారం ప్రకటించింది.హ్యూస్టన్‌లో స్థిరపడిన ముగ్గురు భారతీయ అమెరికన్లు రోహన్ బవడేకర్, డా లవంగ వెలుస్వామి, సుష్మ్ సింగ్ వైరస్ బారినపడి సెంట్‌లూక్స్ ఆసుపత్రిలో చేరారు.

Telugu America, Plasma-

ఇన్‌ఫెక్సన్ ఎక్కువ కావడంతో వారి ప్రాణాలను కాపాడేందుకు అక్కడి వైద్యులు ‘‘ఫ్లాష్మా ట్రాన్స్‌ఫ్యూజన్ పద్థతిని’’ అవలంభించారు.ఈ విధానం ప్రకారం కరోనా సోకి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి ఫ్లాస్మాను సేకరించి అందులోని యాంటీబాడీలను వైరస్‌తో బాధపడుతున్న రోగులకు ఎక్కిస్తారు.తద్వారా కరోనా చికిత్స పొందుతున్న వారి రక్తంలోకి యాంటీబాడీలు ప్రవేశించి మహమ్మారి వైరస్‌తో పోరాడుతాయి.

కరోనా వ్యాక్సిన్ తయారీకి ఏడాదిపైకి సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలను కాపాడేందుకు ఈ విధానం అమలు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ చికిత్సకు అమెరికాలో ఫుడ్‌ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించనప్పటికీ క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదముద్ర వేసింది.అయితే ఎవరి నుంచి పడితే వారి నుంచి రక్తాన్నని సేకరింకూడదు.

కరోనా నుంచి కోలుకుని నెగెటివ్ వచ్చిన 28 రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని ఇతర ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తిని ఎంపిక చేయాలి.ఈ ఫ్లాస్మా థెరపీని 1890లో జర్మన్ శాస్త్రవేత్త ఇమిల్‌వాన్ బెహ్రింగ్ అభివృద్ధి చేశారు.

ఇందుకుగాను ఆయనను 1901లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube