సినిమా ప్రపంచంలో హీరోలు చాలా ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరోను బేస్ చేసుకుని ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ తీస్తుంటారు.
కాగా, ఇటీవల కాలంలో చిత్ర ప్రపంచంలో కొందరు హీరోలు సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరిని కంప్లీట్‌గా చదవాల్సిందే.
సాధారణంగా హీరోలు నెగెటివ్ రోల్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు.అయితే, విలన్ రోల్ చేయాలంటే చాలా ఎస్సెన్స్ ఉండాలనే హీరోలు కొంత మంది ఉన్నారు.అలాంటి వారిని ఒప్పించి మేకర్స్ కొన్ని చిత్రాలు తీయగా, అవి సక్సెస్ కూడా అయ్యాయి.ఇక తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్‌గా ఉన్న వారు తర్వాత కాలంలో హీరోలు అయి సత్తా చాటారు.
మోహన్‌బాబు, గోపీచంద్ ఇంకా చాలా మంది ఉన్నారు.కాగా, నేటి తరం హీరోలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు.హీరోలుగా పలు చిత్రాలు చేస్తూనే విలన్స్‌గా రాణిస్తున్నారు.
1.రానా దగ్గుబాటికి హీరోగా హ్యూజ్ మార్కెట్ ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ఫిల్మ్ లో విలన్‌గా నటించారు.అయితే ప్యారలల్‌గా హీరోగా కూడా సినిమాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు రానా.
ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంలో రానా నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు.
![Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand](https://telugustop.com/wp-content/uploads/2021/09/tollywood-heros-new-trend-in-vilanisam-detasilsa.jpg )
2.మరో యంగ్ హీరో కార్తీకేయ కూడా అలానే చేస్తున్నారు.‘రాజా విక్రమార్క’ వంటి సినిమా లీడ్ రోల్‌లో చేస్తూనే ‘వాలిమై’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
![Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand](https://telugustop.com/wp-content/uploads/2021/09/tollywood-heros-new-trend-in-vilanisam-detailsa.jpg )
3.గతంలో నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫిల్మ్ లో విలన్‌గా కనిపించాడు.నేచురల్ స్టార్ నాని ‘వి’ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేశాడు.ఆది పినిశెట్టికి హీరోగా మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా నటించాడు.
ఇలా యంగ్ హీరోలు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
![Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand Telugu Bheemla Naik, Gang, Gopichand, Karthikeya, Mohan Babu, Nani, Naveen Chand](https://telugustop.com/wp-content/uploads/2021/09/tollywood-heros-new-trend-in-vilanisam-detailsds.jpg )
వీరు మాత్రమే కాకుండా టాలీవుడ్ యంగ్ నటులు నవీన్ చంద్ర, సత్యదేవ్ హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ రోల్స్ ప్లే చేస్తారు.అయితే, సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు.కానీ, వాళ్లు కెరీర్ మధ్యలో విలన్స్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే, యంగ్ హీరోస్ మాత్రం ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్‌గా సినిమాల్లో నటిస్తున్నారు.కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు విలన్‌గా నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్ ప్లే చేస్తున్నారు.