సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు అందరూ కూడా మొహానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటిస్తారు అనే విషయం మనకు తెలుసు… ఇక అందులో కొందరు మాత్రం కొన్ని సినిమాల్లో అసలు మేకప్ లేకుండానే నటిస్తారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూసుకుందాం…
సాయి పల్లవి
![Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T](https://telugustop.com/wp-content/uploads/2023/07/Sai-pallavi-mahesh-babu-fidaa-Gopichand-tollywood-varun-tej.jpg)
ఫిదా( Fidaa ) అనే సినిమా ద్వారా తెలుగు తెర కి పరిచయం అయిన సాయి పల్లవి ఆ సినిమా లో అసలు మేకప్ ఏం వేసుకోకుండా నాచురల్ గా నటించింది తన మొహం మీద మొటిమలు ఉన్న కూడా తన యాక్టింగ్ తో అందరిని కట్టి పడేసింది…ఇక తన డైలాగ్స్ కి ఫిదా అయిన కుర్రలంతా సాయి పల్లవి పేరు జపించడం స్టార్ట్ చేశారు…ఇప్పటికీ కూడా సాయి పల్లవి అసలు మేకప్ వేసుకోకుండానే నటిస్తుంది…
మహేష్ బాబు
![Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T](https://telugustop.com/wp-content/uploads/2023/07/Sai-pallavi-mahesh-babu-nijamGopichand-teja-tollywood.jpg)
మహేష్ బాబు ( Mahesh babu )కెరియర్ లో చాలా సినిమాల్లో నటించాడు అందులో హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.అలాగే ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి.అయితే మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నప్పటికీ తెరపై మరింత ఎట్రాక్టివ్ గా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందే.దాదాపు సినీ తారలందరూ మేకప్ లేనిదే కెమెరా ముందుకు రారు.
కానీ, మహేష్ బాబు తన కెరీర్ మొత్తంలో మేకప్ అనేదే వేసుకోకుండా ఓ సినిమా చేశాడు…
ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.నిజం తేజ( Teja ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా రక్షిత హీరోయిన్ గా నటించింది.
ఇప్పటి టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ఇందులో విలన్ గా నటిస్తే.తాళ్ళూరి రామేశ్వరి, రంగనాథ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు…2003లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.నిజం కోసం పోరాడే ఓ సామాన్య యువకుడి కథ ఇది.
![Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T Telugu Fidaa, Gopichand, Guntur Kaaram, Mahesh Babu, Nijam, Sai Pallavi, Teja, T](https://telugustop.com/wp-content/uploads/2023/07/ai-pallavi-mahesh-babu-nijam-fidaa-Gopichand-teja-tollywood-varun-tej-Guntur-Kaaram-trivikram.jpg)
కానీ, కథలో లోపాలో ఉండటం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేదు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మేకప్ వేసుకోకుండా నటించాడు.న్యాచురల్ గానే కనిపించాలన్న ఉద్దేశంలో మహేష్ బాబు మేకప్ జోలికి పోలేదట.నిజం మూవీ తప్పితే మరే సినిమాలోనూ మహేష్ బాబు మేకప్ లేకుండా నటించలేదు.కాగా, ప్రస్తుతం ఈ స్టార్ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.ఈ మూవీ అనంతరం మహేష్ బాబు రాజమౌళితో ఓ పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయనున్నాడు…
.