తెలుగు సినీ పరిశ్రమలో తండ్రులు సినిమా నిర్మాతలుగా బాగానే రాణించినప్పటికీ కొడుకులు మాత్రం ఒక్క సినిమా తోనే పత్తా లేకుండా పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత ఆర్.
బి.చౌదరి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నిర్మాత ఆర్.బి.చౌదరి కి సూపర్ గుడ్ ఫుడ్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.
అయితే నిర్మాత ఆర్.
బి.చౌదరి కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఇందులో ఒకరు తమిళ్ ప్రముఖ హీరో జీవా కాగా మరో మరొకరు హీరో రమేష్.అయితే జీవా ఆ మధ్యకాలంలో రంగం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.
అంతేగాక హీరో జీవా తమిళంలోతో పాటూ తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.అయితే హీరో జీవా కంటే ముందు తన అన్న రమేష్ అంతకు ముందే తెలుగులో “విద్యార్థి” అనే చిత్రం ద్వారా 2004వ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.
అయితే ఆ చిత్రం అప్పట్లో పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో పలు వ్యక్తిగత కారణాల వల్ల రమేష్ మళ్లీ తెలుగులో హీరోగా నటించలేదు.
కానీ దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత “ఒకటే లైఫ్” అనే చిత్రంలో తెలుగులో నటించాడు.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో రమేష్ చౌదరి బడా నిర్మాత కొడుకు అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
కాగా ప్రస్తుతం రమేష్ చౌదరి “నిరీక్షణ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ చిత్రమైనా తెలుగులో రమేష్ చౌదరి కి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.