డైరెక్టర్ చారుకేష్ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అమ్ము.ఈ సినిమా గృహహింస నేపథ్యంలో రూపొందింది.
ఇందులో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు.ఇక బాబీ సింహ, రఘు బాబు, సత్య, మాల పార్వతి, ప్రేమ్ సాగర్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు కార్తికేయన్ సంతానం, కళ్యాణ సుబ్రమణియన్, కార్తీక్ సుబ్బరాజు నిర్మాతలుగా చేశారు.భరత్ శంకర్ సంగీతాన్ని అందించాడు.
అపూర్వ శాలిగ్రామ్ సినిమాటోగ్రఫీ గా బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
తన తల్లిదండ్రులకు అమ్ము గారాల కూతురు.పైగా ఒక్కతే కూతురు.
అయితే అమ్మును పక్కింటి స్నేహితుల కుమారుడైన సిఐ రవీంద్రనాథ్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు.ఇక పెళ్లయిన కొత్తలో అమ్ము తన భర్త రవి తో చాలా సంతోషంగా ఉంటుంది.
ఆ తర్వాత రవిలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి.ఓ సంఘటన ద్వారా రవిలో అసలు రూపం బయటపడుతుంది.
దీంతో అప్పటి నుంచి రవి అమ్మును బాధ పెడుతూ.హింసిస్తూ ఉంటాడు.
దాంతో అమ్ము చాలా బాధపడుతూ ఉంటుంది.ఇక రవిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు.
తను ఎంత ప్రయత్నం చేసిన అతడు మారడు.దీంతో అమ్ము చివరికి ఏం చేసింది.
ఎటువంటి నిర్ణయం తీసుకుంది.తన భర్తకు ఎటువంటి గుణపాఠం చెప్పింది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఐశ్వర్య లక్ష్మి అమ్ము పాత్రతో బాగా ఆకట్టుకుంది.
ఒక భార్య పాత్రలో
ఎలా ఉండాలో అలా జీవించేసింది.ఇక నవీన్ చంద్ర మాత్రం అద్భుతంగా నటించాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తిగా చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా అన్ని పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి.దర్శకుడు మంచి పాయింట్ ను తీసుకొచ్చాడు.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.ఎడిటింగ్ లో ఇంకాస్త మార్పు ఉంటే బాగుండేది.
మిగిలిన నిర్మాణ విలువలు కూడా పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమాలో ఈ మధ్యకాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఆ సమయంలో తనకు ఎంత ఇబ్బంది ఎదురైన మహిళ ఎదుర్కొనే సత్తాను బాగా చూపించాడు.ఇక మధ్య మధ్యలో ట్విస్టులు కూడా బాగానే అనిపించాయి.
మొత్తానికి ఈ సినిమాను కొంతవరకు బాగానే చూపించాడు డైరెక్టర్.
ప్లస్ పాయింట్స్:
ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర నటన అద్భుతంగా ఉంది.కథ బాగుంది.దర్శకత్వం బాగుంది.ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.కాస్త సాగదీసినట్లుగా అనిపించింది.
బాటమ్ లైన్:
చివరగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమాను ఈ మధ్యకాలంలో జరుగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని తీశాడు డైరెక్టర్.గృహింస నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.