సచిన్ పైలట్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

గత కొద్దీ రోజుల నుండి సచిన్ పైలెట్ గురించి వార్తలు వింటూనే ఉన్నాం.అయితే రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం శుక్రవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

 Suprime Court, Rajasthan, Sachina Pilot-TeluguStop.com

అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.తాజాగా సుప్రీం కోర్టులో తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించింది.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్‌కు ఎదురు దెబ్బ తగిలింది.

ఈ విషయాన్ని మరోవైపు హైకోర్టు నుంచి సుప్రీంకు బదిలీ చేయాలని స్పీకర్ జోషి దాఖలు చేశారు.

స్పీకర్ జోషి చేసిన దాఖలు పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా పడింది.పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడానికి గల కారణాలను తెలియజేయాలంటూ స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం వివరణ కోరారు.

ఈ విషయం పైన కపిల్ సిబాల్‌ స్పందించారు.అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరు కాలేదని తెలియజేశారు.

అంతేకాకుండా సొంత ప్రభుత్వాన్నే అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నారని కోర్టుకు నివేదించారుని తెలిపారు.ఈ వర్గం ఎమ్మెల్యేలు హర్యానా హోటళ్లలో గడుపుతూ మీడియాకు అభిప్రాయాలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలని కోరుతున్నారని సుప్రీంకు నివేదించారు ఆయన.

అయితే అనర్హత నోటీసులపై కోర్టులు జోక్యం చేసుకోలేవని కపిల్ సిబాల్‌ తీవ్రంగా వాదించారు.హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.స్పీకర్ విచక్షణా అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని ఆయన నివేదించారు.అయితే అంతకు ముందు సుప్రీం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిందని తెలియజేశారు.ప్రజాస్వామ్యంలో అసమ్మతి గొంతులను అణచివేయలేమని సుప్రీం స్పష్టం చేసిందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube