ప్రస్తుతం బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది.రీసెంట్ గా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతో నేతలంతా హైదరాబాద్ తరలివచ్చారు.
ఇక్కడే మకాం వేసి తెలంగాణ ప్రజలకు స్పంష్టంగా సంకేతాలు ఇచ్చారు.టీఆర్ఎస్ తో ఢీకొనడానికి సిద్దమయ్యారు.
దీంతో అన్ని నియోజకవర్గాల్లో పావులు కదుపుతున్నారు.ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.
అధిష్టానం డైరెక్షన్ మేరకు రాష్ట్ర నేతలు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
దీంతో కేసీఆర్ కూడా కేంద్రంపై తన వైఖరి ఇప్పటికే చెప్పేశారు.
అయితే తెలంగాణలో క్లారిటీ వచ్చేసినట్లే మరి ఏపీలో బీజేపీతో దోస్తాని సంగతి ఏంది.వైసీపీ వైఖరి ఏంటీ.
అన్నది ఆసక్తికరంగా మారింది.ఏపీలో ఆ పార్టీ చీఫ్ సోము విర్రాజు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాడు.
వచ్చేఎన్నికల్లో అధికారం మనదే అంటున్నాడు.పొత్తులకు కూడా ఓకే జనసేన తమతోనే ఉందని చెప్తున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టిస్తోందని ఫైర్ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ తో దోస్తీ చేసి ముందుకు వెళ్తామని చెప్తున్నారు.
దీనిని బట్టి ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందిని ఎవరైనా అనుకుంటారు.

ఇది రాష్ట్రం వరకు బీజేపీ నేతల వైఖరి.అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం నేతలు వ్యవహరిస్తున్నారు.రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ బీజేపీకే మద్దుతు ప్రకటిస్తారు గనుక బీజేపీతో దోస్తీ ఉన్నట్లే కదా.
అలాంటప్పుడు కేంద్రంతో సఖ్యత ఉన్నట్లే కదా.ఇటీవల భీమవరంలో జరిగిన కార్యక్రమంలో కూడా సీఎం జగన్ మాటలు వింటే ఏపీ ప్రభుత్వంపై బీజేపీపై వైఖరిని ఎలా తీసుకోవాలనేది కూడా ప్రశ్నగా మరింది.

ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర నేతలు చెప్పినా.వాస్తవానికి అది ఇప్పట్లో జరిగే పని కాదు.ఇప్పటినుంచి గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పటి వస్తుందో కూడా తెలియని పరిస్థితి బీజేపీది.ఇది తెలుసు కాబట్టే కేంద్రంలో బీజేపీ వైసీపీతో చెలిమి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.జగన్ ని ఢీ కొంటే ఇప్పట్లో వచ్చే లాభం ఏం లేదని తెలుసు కాబట్టే ఈ వైఖరి ప్రదర్శిస్తోందిని టాక్.ప్రస్తుతానికైతే తెలంగాణతో సరిపెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.