టీడీపీలో చినబాబు గ్రాఫ్ పెరిగిందా?

టీడీపీలో రాజకీయం మారుతోంది.ఇన్నాళ్లూ ఆ పార్టీకి పెద్ద దిక్కు ఎవరంటే చంద్రబాబే.

 Has The Nara Lokesh Graph Increased In Tdp Details, Nara Lokesh, Telugu Desam P-TeluguStop.com

ఆ పార్టీ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కర్త, కర్మ, క్రియ ఆయనే అనేలా పరిస్థితి ఉండేది.కానీ చంద్రబాబుకు వయసు అయిపోతోంది.

రాజకీయ చతురత కూడా తగ్గిపోతోంది.అందుకే ఆయన బాధ్యతలను తనయుడు లోకేష్‌కు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పాతికేళ్లకు పైగా బాబు గారూ అంటూ చంద్రబాబు చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు మెల్లగా చినబాబు సారూ అంటూ తిరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.

దీంతో టీడీపీ లోకేష్‌కు ప్రాధాన్యత పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

అందుకే మహానాడులో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారని.వ‌రుస‌గా మూడుసార్లు పోటీచేసి ఓట‌మిపాలైన‌వారికి ఈ సారి ఎన్నిక‌ల్లో సీటిచ్చేది లేద‌ని ప్రకటించారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

అయితే సీనియర్లమని భావించే వారు చంద్రబాబుతోనే తమ రాజకీయం అని అనుకునే వారు మాత్రం లోకేష్ వైఖరి వల్ల ఇబ్బందిపడుతున్నారట.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Mahanadu, Lokesh, Lokesh Graph, Tdp Maha

వచ్చే ఎన్నికల్లో టీడీపీలో యువతకే ప్రాధాన్యం ఇస్తామని లోకేష్ తెగేసి చెప్పడంతో పలు జిల్లాలకు చెందిన యువ నేతలు చినబాబులో మార్పు కనిపిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు.టీడీపీలో లోకేష్‌కు ప్రాధాన్యత పెరగడంతో ఆయన్ను అన్న, తమ్ముడు అని పలువురు టీడీపీ నేతలు ఆప్యాయంగా పిలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.లోకేష్‌కు గౌరవం ఇచ్చేందుకు, ఆయన చెప్పినట్లుగా వినేందుకు నేతలెవ్వరూ ఏ మాత్రం సంకోచించడం లేదు.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Mahanadu, Lokesh, Lokesh Graph, Tdp Maha

మహానాడు కార్యక్రమంలోనూ శ్రీ‌కాకుళం నుంచి అనంతంపురం వ‌ర‌కు టీడీపీ నేతలందరితో లోకేష్‌ ఎక్కువ సమయం గడిపేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో పార్టీలో అంతా తానే సంకేతాలు చినబాబు పంపిన‌ట్ల‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్టీని బ‌లోపేతం చేయాలంటే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని లోకేష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.అయితే చాలా మంది సీనియర్లు మాత్రం లోకేష్ నయా బాస్ అన్న విషయాన్ని కొంత డైజెస్ట్ చేసుకోలేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.మొత్తానికి తాజా పరిస్థితుల కారణంగా టీడీపీలో చినబాబు గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube