ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు.ఈ రోజు ఆయన కుమారుడు మహేష్ బాబు సినిమాల అప్డేట్ ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం ఇచ్చేవారు.
అయితే ఈసారి మరి ఏ హడావిడి కనిపించడం లేదు.దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
స్పెషల్ సర్ప్రైజ్ ఏమీ లేదు కదా.కనీసం పుట్టిన రోజు హంగామా కూడా కనిపించడం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలాగే కలెక్షన్స్ కూడా పోటీ లేకపోవడంతో దూసుకు పోతున్నాడు.ప్రెసెంట్ ఈయన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుందని సమాచారం.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఆశించారు.
కానీ ఎలాంటి సర్ప్రైజ్ లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.కృష్ణ పుట్టిన రోజున తన సినిమాల అప్డేట్ లపై ఎప్పుడు మహేష్ బాబు ఆసక్తి కనబరిచేవాడు.
కానీ ఈసారి అలాంటివి కనిపించడం లేదు.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను 2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
కారణం ఏదైనా అప్డేట్ రాకపోవడం అనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్ అనే చెప్పాలి.







