బిగ్‌బాస్‌4 : గంగవ్వకు కరోనా, షో వాయిదా అంటూ పుకార్లు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 సెప్టెంబర్‌ 6 నుండి ప్రారంభం కాబోతుంది అంటూ స్టార్‌ మా నుండి అధికారిక ప్రకటన వచ్చింది.షో కు సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

 Gangavva In Telugu Bigg Boss 4, Telugu Big Boss 4, Star Maa, Nagarjuna, My Villa-TeluguStop.com

కొన్ని రోజుల క్రితమే షో లో పాల్గొనే వారిని నిర్వాహకులు పార్క్‌ హయత్‌లో ఐసోలేషన్‌ చేశారు.ఇప్పటికే వారిలో ఒకరికి కరోనా వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆ విషయంలో స్టార్‌ మా నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇప్పుడు మరో ఇద్దరికి కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి.

కరోనా కారణంగా పార్క్‌ హయత్‌ లోనే ఉంచి వారికి ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మై విలేజ్‌ షో కు చెందిన గంగవ్వ ఈసారి షో లో ఉండబోతుంది.

అయితే ఆమెకు కరోనా అంటూ ప్రచారం జరుగుతోంది.ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఆమె ఆరోగ్యం విషయంలో అప్‌ డేట్‌ ఏమీ లేదు.కనుక ఆమె షో లో ఉంటుందనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Coronavirus, Gangavva, Show, Nagarjuna, Maa, Telugu Big Boss-Movie

షో ప్రారంభించే రోజు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. ఆ రోజు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ఎవరు అసలు కరోనా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గంగవ్వ ఉంటే షో చాలా ఎనర్జిటిక్‌ గా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.అయితే ఆమెకు కరోనా అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా లేకుంటే ఇప్పటి వరకు షో సీజన్‌ సగం వరకు పూర్తి అయ్యేది.ఆలస్యం అవ్వడంతో కరోనా భయంతో అంతా ఏం జరుగుతుంది షో లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే ఆసక్తిని చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube