టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి కాగా సూపర్ అనే సినిమాతో అనుష్క నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.
విక్రమార్కుడు, లక్ష్యం సినిమాలతో నటిగా అనుష్కకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ నటిగా అనుష్క కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలుగా నిలిచాయి.
కెరీర్ తొలినాళ్లలో అనుష్క నటించిన సినిమాలలో స్వాగతం సినిమా కూడా ఒకటి. జగపతిబాబు ఈ సినిమాలో హీరోగా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో తాను అస్సలు నటించనని అనుష్క చెప్పారని సమాచారం.
ఈ సినిమాలోని మనసా మౌనమా సాంగ్ లో అనుష్క కొండపై నుంచి కిందికి పడిపోవాలి.
అయితే అనుష్క మాత్రం ఆ షాట్ చేయడానికి గజగజా వణికిపోయారట.
యూనిట్ సభ్యులు ఏం కాదని చెప్పినా ఆ సీన్ లో తాను నటించలేనని అనుష్క తెగ ఏడ్చేశారట.ఆ తర్వాత దర్శకుడు ఆ షాట్ ను తీసేసి పాటను షూట్ చేశారని సమాచారం.
సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క తనకు నచ్చే, నప్పే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు.

అయితే ఆ సినిమా తర్వాత అనుష్క ఎన్నో సినిమాలలో పవర్ ఫుల్ రోల్స్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని అనుష్క ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.