ప్రస్తుత కాలంలో కొందరు యువకులు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతున్నారు.అందుకోసం ఊరికే ఉండకుండా కొందరు చిత్ర, విచిత్రాలు చేస్తుంటారు.
కొందరు బైకులపై ఫీట్లు చేస్తూనే ఉన్నారు.మరికొందరు కార్లతో సాహసాలు చేస్తూ వీడియోలు, సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజ్ పొందాలని భావిస్తున్నారు.
తాజాగా.ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.
దానిని కొందరు వీడియో తీసి పోస్ట్ చేశారు.ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.
ఘజియాబాద్ లో ఎలివేటెడ్ రోడ్డుపై స్కార్పియో వాహనం డ్రైవ్ చేస్తున్న ఓ యువకుడు తన హీరోయిజాన్ని చూపించాలనుకున్నాడు.ఓవైపు కారు రోడ్డుపై వెళ్తుండగానే .కారు డ్రైవర్ వద్ద డోర్ తెరచి కూర్చున్నాడు.డోర్ గ్లాస్ మీద ఒక కాలు.
డ్రైవర్ సీటు మీద మరొ కాలు పెట్టాడు.కారు డోర్‌ని కాలుతో ఆపుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు.
మధ్యలో కారు డ్రైవింగ్ చేస్తూ.మళ్లీ ఇదే తరహాలో డ్రైవర్ సీట్‌లో ఓ పక్కకు కూర్చొని ఎవరితోనో ముచ్చటిస్తున్నట్లుగా ఫోజులిచ్చాడు.
రాత్రి వేళ కావడం, రోడ్డుపై పెద్దగా వాహనాల రద్దీ లేకపోవడంతో ఈ కుర్రాడి విచిత్రమైన స్టంట్స్ చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అంతే కాదు.ఇంత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువకుడు.కారుని సింగిల్ హ్యాండ్‌తో కంట్రోల్ చేయగలనన్న ధీమాతో అత్యంత నిర్లక్ష్యంగా ట్రాఫిక్ రూల్స్, డ్రైవర్‌గా తీసుకోవాల్సిన ఏ జాగ్రత్తలను పాటించకపోవడంతో వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలోని కారు నెంబర్ ఆధారంగా అతడ్ని గుర్తించి తగిన చర్యలు తీసుకునే పనిలో ఘజియాబాద్ పోలీసులు ఉన్నారు.ఫీట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఏదైనా సాధించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.