అల్లూరి, కొమురం భీమ్ లు ఈ గెటప్స్ ఏంటి జక్కన్న?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

 Social Media Talk About Rrr Movie Ram Charan Ntr Look,latest Tollywood News-TeluguStop.com

రెండవ పాట విడుదలకు సంబంధించిన అప్‌డేట్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇద్దరు హీరోల స్టైలిష్ లుక్‌ తో కూడిన పోస్టర్ తో రివీల్ చేయడం జరిగింది.ఇద్దరు హీరోలను ఇలా చూడటంతో ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నోరు వెళ్లబెడుతున్నారు.

సినిమా ప్రారంభం అవ్వడానికి ముందు నుండి కూడా అల్లూరి సీతారామ రాజుగా రామ్‌ చరణ్ మరియు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ ను చూపించబోతున్నట్లుగా జక్కన్న చెప్పాడు.దాంతో ప్రేక్షకులు ఒక భారీ దేశ భక్తి స్వాతంత్ర్య ఉద్యమ సినిమాగా ఊహించుకుంటున్నారు.

దాంతో యూనిట్‌ సభ్యులు ఈ సినిమా స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యం సినిమా కాదంటూ చెప్పే ప్రయత్నం చేశారు.సరే ఇది ఆ తరహా సినిమా కాకున్నా కూడా హీరోలు ఇద్దరు అవే పాత్రలు కనుక ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని అల్లూరిని ఆరాధించే వారు.

కొమురం భీమ్ ను పూజించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో ఈ పోస్టర్‌ ఖచ్చితంగా వారికి కాస్త నిరుత్సాహం కలిగిస్తుందని అంటున్నారు.

Telugu Rajamouli, Ram Charan, Rrr-Movie

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు ఇలా స్టైలిష్‌ లుక్ లో కనిపించడం సినిమా మొత్తంలో ఉంటుందా లేదంటే పాట వరకేనా అనేది తెలియాల్సి ఉంది.సినిమా లో చరణ్‌ బాణం తో రణరంగంలో దూకుతాడని అంతా ఆశిస్తున్నారు.ఇక కొమురం భీమ్ పులితో బెబ్బులిలా పోరాటం చేస్తాడని ఆశిస్తున్నారు.ఇవన్నీ సినిమాలో ఉండబోతున్నాయా లేదంటే ఇలాగే స్టైలిష్ లుక్ లో ఉంటారా అంటూ రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ సమయంలో ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా పై కొందరు జనాలు మరింతగా అంచనాలు పెంచుకుంటున్నారు.ఇలాంటి ఒక సినిమా ను తీయాలంటే ఖచ్చితంగా అది రాజమౌళి వల్లే అంటున్నారు.

సినిమా కథ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు.కాని స్క్రీన్‌ ప్లే విషయంలో అంతర్జాతీయ స్థాయిలో అద్బుతంగా దర్శకుడు రాజమౌళి మల్చగలడు.

అందుకే జక్కన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఇద్దరు హీరోల గెటప్స్ గురించి వస్తున్న వార్తలకు జక్కన్న ఇప్పుడు నోరు తెరిచి సమాధానం చెప్పడు.

సినిమా విడుదల తర్వాతే అన్ని విషయాలు క్లారిటీ వస్తాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube