ఫ్లోరిడాలోని ( Florida )పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో కొత్త చట్టం ప్రవేశపెట్టింది ప్రభుత్వం.ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పిల్లలు, సోషల్ మీడియా గురించిన ఆ కొత్త చట్టాన్ని ఆమోదించారు.
ఈ చట్టం యునైటెడ్ స్టేట్స్‌లోనే( United States ) అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటిగా చెప్పవచ్చు.ఈ చట్టం ప్రకారం 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు ఉండకూడదు.14 లేదా 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
గవర్నర్ మొదట ప్రతిపాదించిన చట్టం కంటే ఇది చాలా సడలించిన చట్టం.
మొదటి ప్రతిపాదనలో 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ సోషల్ మీడియా నిషేధం ఉండేది.ఈ చట్టం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలను సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ నుంచి రక్షించడం,సోషల్ మీడియా వ్యసనం నుంచి పిల్లలను రక్షించడం.
పిల్లల ఆన్‌లైన్( Children’s Online ) కార్యకలాపాలపై తల్లిదండ్రులకు మరింత నియంత్రణ ఇవ్వడం.ఈ చట్టంపై విమర్శలు కూడా వస్తున్నాయి.
కొందరు ఈ చట్టం పిల్లల స్వేచ్ఛను అడ్డుకుంటుందని వాదిస్తున్నారు.మరికొందరు ఈ చట్టాన్ని అమలు చేయడం కష్టమని అంటున్నారు.

ఫ్లోరిడాలో పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై కఠినమైన నియంత్రణలు విధించే చట్టం ఆమోదం పొందినప్పటికీ, చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.కొందరు ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, వారి పిల్లలకు ఏది ఉత్తమమో నిర్ణయించే తల్లిదండ్రుల హక్కులను ఇది హరిస్తుందని వాదిస్తున్నారు.చట్టం బదులు, తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మెరుగైన సాధనాలు ఉండాలని కొందరు సూచిస్తున్నారు.పిల్లలకు మానసిక ఆరోగ్యానికి మరింత మద్దతు అవసరం, సోషల్ మీడియా నిషేధం కాదు అని అంటున్నారు.
యువకులు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం హరిస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఈ చట్టం న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంటుందని భావిస్తున్నారు.రాష్ట్రం యువకులకు సమాచారాన్ని పొందే హక్కును హరిస్తుందని వాదిస్తూ కొందరు ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు.గవర్నర్, చట్టం మద్దతుదారులు ఈ చట్టం పిల్లలను హానికరమైన కంటెంట్ నుండి రక్షిస్తుందని, వ్యసనాన్ని నివారిస్తుందని వాదిస్తున్నారు.
కోర్టులో ఈ చట్టాన్ని సమర్థించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.ఈ చట్టం రాష్ట్రంలో అమలులోకి వస్తుందా లేదా అనేది న్యాయస్థానాలు ఏమని నిర్ణయిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ చట్టం ప్రభావం ఏమిటో తెలుసుకోవాలంటే మనం కొంత కాలం వేచి చూడాలి.