సినిమానే నాడిఎన్ఏ.... నాన్నే నాకు స్ఫూర్తి... సితార కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక మహేష్ బాబు నమ్రత( Namrata ) ల గారాల పట్టి సితార ( Sitara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇంత చిన్న వయసులోనే ఎంతోసేవా గుణం కలిగినటువంటి ఈ చిన్నారి ఒకవైపు చదువులలో రాణిస్తూనే మరోవైపు సినిమాలపరంగా కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారు.

 Sitara Dedicates Emotional Post Her Father Mahesh Babu And Krishna , Sitara, Mah-TeluguStop.com

ఇంత చిన్న వయసులోనే తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సితార ఈ మధ్యకాలంలో పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.నేడు ఇంటర్నేషనల్ సినిమా డే ( International Cinima Day ) కావడంతో ఇంస్టాగ్రామ్ వేదికగా తన తల్లిదండ్రులతోపాటు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.వెండితెరపై అగ్రగామిగా నిలిచినటువంటి మా నాన్నగారికి తన తండ్రి ఎంత స్ఫూర్తిగా ఉండేవారో అలాగే మా నాన్న కూడా నాకు అంతేస్పూర్తిగా నిలిచారని తెలిపారు.

లెజెండరీ ఎవర్గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు తాతగారు మా అందరి పై ఈ విధమైనటువంటి ప్రభావాన్ని చూపారు.

ఆయన వారసత్వంలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను.నా జీవితంలో సినిమాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.సినిమా నాకు కేవలం చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు సినిమానే నా డిఎన్ఏ లో ఉంది.

నా కుటుంబ సినీ ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా సితార షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube