సౌందర్య చనిపోయినా ఆ రూపంలో బ్రతికే ఉందంటున్న ఫ్యాన్స్.. వాళ్లకు విద్య అందించడంతో?

సౌందర్య( Soundarya ) మరణించి దాదాపుగా రెండు దశాబ్దాలు అయినా అభిమానులు మాత్రం ఆమెను సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.సౌందర్య చిన్న వయస్సులోనే 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

 Shocking Facts About Heroine Soundarya Details, Soundarya, Soundarya Birthday, S-TeluguStop.com

సౌందర్య చనిపోయినా ఆమె ఆశయం నెరవేరిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.గ్లామరస్ రోల్స్ పోషించకుండానే సౌందర్య మంచి పేరు సంపాదించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అప్పటి స్టార్ హీరోలందరికీ జోడీగా నటించిన సౌందర్య ఆయా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించడం గమనార్హం.

వెంకటేశ్ సౌందర్య జోడీ హిట్ జోడీ కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.సౌందర్య తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల( Social Services ) కోసం ఖర్చు చేశారు.

Telugu Amara Sathvika, Autism, Soundarya-Movie

సౌందర్య పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించగా ఆ సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.రేపు సౌందర్య పుట్టినరోజు( Soundarya Birthday ) కాగా సౌందర్య ఆశయం ప్రకారం కుటుంబ సభ్యులు అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్( Amara Sathvika Social And Education Trust ) పేరుతో ఫౌండేషన్ స్కూల్ ను మొదలుపెట్టగా ఈ స్కూల్ ద్వారా ఆటిజం పిల్లలకు విద్యను అందిస్తున్నారని సమాచారం అందుతోంది.

Telugu Amara Sathvika, Autism, Soundarya-Movie

సౌందర్య లోకాన్ని విడిపిపెట్టి వెళ్లిపోయినా ఫౌండేషన్ ద్వారా చదువుతున్న విద్యార్థుల రూపంలో జీవించి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌందర్య తన సినిమాల రూపంలో జీవించి ఉన్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.సౌందర్య లాంటి గొప్ప నటి ఈ తరంలో ఎవరూ లేరని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సౌందర్య తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా ప్రశంసలను సొంతం చేసుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube