వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( Ys Sharmila ) అనుకున్నది సాధించినట్లుగానే కనిపిస్తున్నారు.ఒంటరిగా పార్టీని ఎన్నికలకు తీసుకువెళ్లి అధికారంలోకి రావడం కష్టమనే విషయాన్ని గుర్తించిన ఆమె, తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి .అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.అయితే పార్టీని విలీనం చేసినా, తెలంగాణలో షర్మిల కు ఏ ప్రాధాన్యం ఇవ్వకూడదని, ఆమెను ఏపీ రాజకీయాలకు పంపించాలని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తో పాటు మరికొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో షర్మిల పార్టీ విలీనం కాస్త ఆలస్యం అయింది.అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టేది లేదని , తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానంటూ షర్మిల కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు చెప్పి ఒప్పించగలిగారు.
![Telugu Brs, Congress, Dk Siva Kumar, Rahul, Revanth Reddy, Sonia Gandhi, Telanga Telugu Brs, Congress, Dk Siva Kumar, Rahul, Revanth Reddy, Sonia Gandhi, Telanga](https://telugustop.com/wp-content/uploads/2023/09/Congress-revanth-Reddy-tummala-nageswararao-Sonia-Gandhi-Rahul-DK-Siva-Kumar.jpg)
కాంగ్రెస్ అధిష్టానం ,షర్మిల మధ్య చర్చలు సక్సెస్ అయ్యే విధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చక్రం తిప్పారు.ఇదిలా ఉంటే ఈరోజు కాంగ్రెస్ అగ్ర నాయకులు హైదరాబాదులో అడుగుపెట్టారు .ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు .వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటించనుంది.ఈరోజు పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలతో పాటు, వైఎస్ షర్మిల>( Ys Sharmila ) కూడా తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.హైదరాబాద్ కు వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో షర్మిల మరోసారి సమావేశం అయ్యారు.
కాంగ్రెస్ లో చేరిక, వైసీపీ విలీనం వ్యవహారాలపై ఆయనతో చర్చించారు.ఇక సోనియాగాంధీ తోనూ సమావేశం కాబోతున్నారు.కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల సైతం ఆసక్తిగానే ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు .
![Telugu Brs, Congress, Dk Siva Kumar, Rahul, Revanth Reddy, Sonia Gandhi, Telanga Telugu Brs, Congress, Dk Siva Kumar, Rahul, Revanth Reddy, Sonia Gandhi, Telanga](https://telugustop.com/wp-content/uploads/2023/09/Telangana-CM-KCR-Telangana-elections-BRS-Congress-revanth-Reddy-tummala-nageswararao-Sonia-Gandhi-Rahul-DK-Siva-Kumar.jpg)
కానీ అక్కడి సీటుపై బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు( Tummala nageswararao ) ఆశలు పెట్టుకున్నారు .ఆయన ఈరోజు కాంగ్రెస్ లో చేరుతున్నారు.అయితే తుమ్మలకు పాలేరు నియోజకవర్గ టికెట్ కు బదులుగా ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ కీలక నేతలు మంతనాలు చేయడం తో తుమ్మల సైతం దీనికి అంగీకారం తెలిపారట.దీంతో షర్మిలకు పాలేరు అసెంబ్లీ టికెట్ ఖరారైనట్టు సమాచారం.