బైక్‌పై రెచ్చిపోయిన లవర్స్.. ముద్దులతో రెచ్చిపోతూ అడ్డంగా బుక్కయ్యారు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక రకాల వీడియోలు దర్శనం ఇస్తున్నాయి.ఇక నేటి యువత సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు.

 Couple Kissing On Bike In Jaipur Video Viral Details, Lover's, On Bike, Viral La-TeluguStop.com

మరి ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో సగటు జంట కావాలని చేశారో, లేదంటే ఆ చుట్టు పక్కల వున్నవారు రికార్డ్ చేశారో తెలియదు గాని ఆ వీడియో చూసిన నెటిజనం వారిది బరితెగింపుగా అభివర్ణిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని( Rajasthan ) జైపూర్‌లో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై( Bike ) ఓ జంట రోడ్డుపైన పయనిస్తుండగానే లిప్ టు లిప్ కిస్సులతో రెచ్చిపోయారు.

ఈ క్రమంలో తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని కూడా వారు మరిచిపోయారు.దాంతో ఈ ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్( Kissing Stunt ) కెమెరాకు చిక్కింది.ఇంకేముంది, కట్ చేస్తే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో బైక్‌పై వెళుతుండగా అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం చాలా స్పష్టంగా మీరు గమనించవచ్చు.జైపూర్‌లోని( Jaipur ) దుర్గాపుర ప్రాంతంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో పోలీసులకు చేరడంతో… సదరు జంటని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

కాగా ఈ వీడియో చూసిన నెటిజనం మాత్రం ఆ జంటపైన కారాలు మిరియాలు నూరుతున్నారు.“భారత యువత నేడు కామం అనే వికారంలో కొట్టుమిట్టాడుతోంది!” అని కామెంట్ చేయడం ఇక్కడ మనం చూడవచ్చు.మరికొంతమంది కామెంట్ చేస్తూ….ఇలాంటి వారిని కన్నవారు ఎంతటి దురదృష్టవంతులో అని వాపోతూ కామెంట్ చేస్తున్నారు.ఇంకా చాలామంది వారిపైన చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తులో డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube